సింగపూర్‌లో ఉద్యోగాలంటూ టోకరా

Sun,October 13, 2019 01:32 AM

-14 మంది నుంచి రూ.50 లక్షలు వసూలు
మహబూబ్‌నగర్ క్రైం: సింగపూర్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి ముగ్గురు కేటుగాళ్లు 14 మంది నుంచి సుమారు రూ. 50 లక్షలు వసూలుచేశారు. అనంతరం ముగ్గురు పత్తాలేకుండా పోవడంతోపాటు బాధితులు మహబూబ్‌నగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌లోని షాషాబ్‌గుట్టకు చెందిన అహ్మద్‌ఖాన్ వీరన్నపేటకు చెందిన షేక్‌ఖదీర్‌తో పరిచయం ఏర్పరచుకున్నాడు. తనతోపాటు హైదరాబాద్‌కు చెందిన సుగుణాదేవి, విజయవాడ కు చెందిన పగిడ్యాల సుమంత్‌కు సింగపూర్‌లో హోటల్ వ్యాపారాలు ఉన్నాయని ఖదీర్‌కు తెలిపాడు. ఎవరైనా నిరుద్యోగులు ఉంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని, డ్రైవింగ్ వచ్చినవారికి ఆ దేశంలో మంచి వేతనం వస్తుందని న మ్మబలికాడు. నిరుద్యోగి అయిన ఖదీర్.. అ హ్మద్‌ఖాన్‌కు గత జూలైలో రూ.3 లక్షలు ఇచ్చా రు. త్వరలో వీసా వస్తుందని, సింగపూర్‌కు తీసుకెళ్లి ఉద్యోగంలో నియమిస్తానని చెప్పాడు. ఇలా 13 మందిని నమ్మించి ఒక్కొక్కరి దగ్గర రూ.2 లక్షల నుంచి రూ.4.30 లక్షల వరకు అహ్మద్‌ఖాన్‌తోపాటు మరో ఇద్దరు వసూలుచేశారు. ఆ తర్వాత వారి జాడలేదు. ఫోన్‌చేస్తే ముగ్గురి ఫోన్‌నంబర్లు స్విచ్ ఆఫ్ వస్తుండటంతో మోసపోయినట్టు గుర్తించి బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

74
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles