మూడుతీర్ల లెక్కలతో ముప్పుతిప్పలు

Sat,September 14, 2019 12:50 AM

-పోతిరెడ్డిపాడు డిశ్చార్జిపై ఏపీకి కృష్ణాబోర్డు లేఖ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా విడుదలవుతున్న నీటిపై మూడురకాలు లెక్కలు ఇవ్వడంపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు తీవ్ర ఆసహనం వ్యక్తంచేసింది. శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు ఇచ్చేవి ఒకలా.. ఏపీ, తెలంగాణ ఇంజినీర్ల సంయుక్త నివేదికలో మరోలా.. బోర్డు ఇంజినీర్ల సర్వేలో ఇంకోలా లెక్కలు ఉండటం బోర్డు అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నది. దీనిపై కృష్ణానదీ యాజమాన్యబోర్డు సభ్య కార్యదర్శి పరమేశం తాజాగా ఏపీ జల వనరులశాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావుకు లేఖరాశారు. గతనెల 27-30 తేదీల్లో పోతిరెడ్డిపాడు ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటి విడుదల జరిగినట్టు శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ ఇంజినీర్ల సంయుక్త నివేదికలో ఒక్కోరోజు ఒక్కోలా 12,237-16,165 క్యూసెక్కుల వరకు డిశ్చార్జి ఉన్నట్టు తెలిపారు.


ఇక బోర్డు ఇంజినీర్లు ఏడీసీపీ యంత్రంద్వారా చేపట్టిన పరిశీలనలో కూడా ఒక్కోరోజు ఒక్కోలా 16,263-19,365 క్యూసెక్కుల డిశ్చార్జి ఉన్నట్టు తేల్చారు. దీంతో ఈ మూడింటిలో దేనిని పరిగణనలోకి తీసుకోవాలనేది బోర్డు అధికారులకు అంతుబట్టడం లేదు. దీంతో రెండు రాష్ర్టాల ఇంజినీర్లతో సంయుక్త పరిశీలన ప్రక్రియలను కొనసాగింది సరైన డిశ్చార్జి లెక్కలు పంపాలంటూ బోర్డు ఏపీ ఈఎన్సీకి రాసిన లేఖలో తెలిపింది. కాగా, పోతిరెడ్డిపాడు, సాగర్ ఎడమకాల్వతోపాటు వరద సమయంలో వినియోగ లెక్కల్ని పరిగణనలోనికి తీసుకోవద్దనే ఏపీ ప్రతిపాదనతోపాటు ఇతర అంశాలపై చర్చించేందుకు బోర్డు చైర్మన్ ఈ నెల 18న రెండు రాష్ర్టాల ఈఎన్సీలతో భేటీ కానున్నట్టు తెలిసింది.

195
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles