నేడు భద్రాచలంలో తొలి ఏకాదశి వేడుకలు


Fri,July 12, 2019 01:21 AM

tholi ekadasi celebrations in Bhadrachalam

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారికి తొలి ఏకాదశి పూజలు నిర్వహించనున్నట్లు దేవస్థానం విశ్రాంత ప్రధాన అర్చకుడు పొడిచేటి జగన్నాథాచార్యులు తెలిపారు. ఉద యం స్వామివారికి అంతరాలయంలో మూల మూర్తులకు వజ్రవైడూర్య మరకత మాణిక్యాలతో, బెంగుళూరు వారు స్వామివారికి సమర్పించిన రూ.5 కోట్ల విలువ చేసే బంగారు కవచాలతో ఉత్సవ మూర్తులకు అంతరాయలంలో ఏకాంత తిరుమంజనం గావిస్తారు. తదుపరి ఉపాలయంలో శ్రీలక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ప్రాకార మండపంలో 108 మందితో విష్ణు సహస్ర నామ పారాయణం, 5 గంటలకు ఆరాధన, 6 గంటలకు సంధ్యా హారతులు, 7 గంటలకు రాజదర్బార్, 8 గంటలకు తిరువీధిసేవ, 9 గంటలకు చుట్టుసేవ, 10 గంటలకు ఆరాధన, ఆరగింపు నిర్వహించనున్నట్లు వివరించారు. గురువారం శ్రీకృష్ణచైతన్య సంఘం ఆధ్వర్యంలో భక్తులు గోటి తలంబ్రాల కోసం కొత్త వరి ధాన్యాల విత్తనాలకు ప్రత్యేక పూజలు చేశారు.

339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles