దాదాపు సాధారణం


Tue,April 16, 2019 01:54 AM

This years abundant rainfall

-ఈ ఏడాది విస్తారంగా వానలు
-వానకాలం పంటలకు మంచి వర్షాలు
-ఎల్‌నినో ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు: ఐఎండీ

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ/న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలోని రైతాంగానికి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుభవార్తను అందించింది. ఈ ఏడాది దాదాపు సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 2019 ఏడాదికిగాను తొలి విడుత వర్షపాత అంచనాలను ఐఎండీ సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణానికి దగ్గరగా వర్షపాతం నమోదవుతుందని, దీర్ఘకాలిక సగటు (ఎల్పీఏ) వర్షపాతంలో ఇది 96 శాతం (ఐదు శాతం అటూఇటూ) వరకు ఉండొచ్చని అంచనావేసింది. 1951-2000 మధ్యకాలంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 89 సెం.మీగా ఉంది. ఈ ఏడాది కొత్తగా సాధారణానికి దగ్గరగా అనే క్యా టగిరీని ఐఎండీ ప్రవేశపెట్టింది. ఎల్పీఏలో 96-104 శాతం వర్షపాతం నమోదుకావడాన్ని ఈ క్యాటగిరీలో చేర్చింది. అయితే గతేడాది వెల్లడించిన అంచనాల్లో, ఎల్పీఏలో 96-104 వర్షపాతం నమోదుకావడాన్ని సాధారణ వర్షపాతంగా, 90-96 వర్షపాతం నమోదుకావడాన్ని సాధారణం కంటే తక్కువ వర్షపాతంగా ఐఎండీ పేర్కొంది. 96 శాతం వర్షపాతం&సాధారణం, సాధారణం కంటే తక్కువ వర్షపాత క్యాటగిరీలకు దరిదాపుల్లో ఉంటుంది.

భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం రాజీవన్, ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ వర్షపాత అంచనాలను విడుదల చేశారు. ప్రాంతాల వారీగా, నెలల వారీగా వర్షపాత అంచనాలను జూన్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ సీజన్‌లో ఎల్‌నినో బలహీనంగా ఉండే అవకాశం ఉందని రాజీవన్ తెలిపారు. ఎల్‌నినో ప్రభావం జూన్‌లో కొద్దివరకు ఉండొచ్చని, జూలై నుంచి వర్షాలు జోరందుకుంటాయని పేర్కొన్నారు. మొత్తంగా దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, వానకాలం పంటలకు ఇది కలిసివస్తుందని కేజే రమేశ్ చెప్పారు. కాగా, ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ ఈనెల ప్రారంభంలో అంచనావేసింది. గతేడాది ఎల్పీఏలో 97 శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనావేయగా, సీజన్ ముగిసే సమయానికి దేశవ్యాప్తంగా 91 శాతం వర్షపాతమే నమోదైంది.

తెలంగాణలో ఈసారి మంచివానలే

తెలంగాణలో ఈసారి మంచిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 755.1 మిల్లీ మీటర్లని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైవీ రెడ్డి వెల్లడించారు. ఈసారి అందులో 96 శాతం అంటే 717 మి.మీ వరకు వర్షపాతం నమోదు కావొచ్చని ఆయన అంచనావేశారు. గతేడాది సాధారణ వర్షపాతం కంటే రెండు శాతం తక్కువగా వర్షాలు కురిశాయని చెప్పారు. ఈసారి 4 శాతం ఎక్కువ కానీ తక్కువగానీ ఉండొచ్చని తెలిపారు. సాధారణంగా రాష్ట్రంలో ఆదిలాబాద్‌లో అత్యధికంగా 998 మి.మీ వరకు వర్షపాతం నమోదవుతుందని, ఈసారీ అదే పరిస్థితి ఉండొచ్చన్నారు. ఐఎండీ అంచనా ప్రకారం తెలంగాణలో సకాలంలో వర్షాలు రావొచ్చని చెప్పారు.

2347
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles