తుంగభద్రకు ఈసారి 163 టీఎంసీల వరద


Wed,June 12, 2019 01:12 AM

This time 167 TMC floods to Tungabhadra River

-2019-20కి అంచనా వేసిన బోర్డు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ/అయిజ: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఈసారి (2019-20 నీటి సంవత్సరంలో) 163 టీఎంసీల వరద రావచ్చని తుంగభద్ర బోర్డు అంచనా వేసింది. తుంగభద్రలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి 212 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. మంగళవారం కర్ణాటకలోని హొస్పేటలో జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశానికి కర్ణాటక అధికారులు హాజరుకాలేదు. సినీ నటుడు గిరీశ్ కర్నాడ్ మృతికి సంతాపంగా కర్ణాటక ప్రభుత్వం సెలవు ప్రకటించడమే ఇందుకు కారణం. తెలంగాణ, ఏపీ అధికారులు మాత్రమే హాజరుకావడంతో బోర్డు భేటీలో ఎలాంటి చర్చలు జరుగలేదు. ముఖ్యంగా ఆర్డీఎస్ ఆధునీకరణ పనులపై తెలంగాణ చర్చించాలని అనుకున్నా వీలు కాలేదు.

112
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles