లైంగిక దాడి కేసుల్లో ఇద్దరికి జీవిత ఖైదు


Fri,July 12, 2019 01:18 AM

The two have been sentenced to life imprisonment in a sexual assault case

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ/కరీంనగర్ లీగల్: అత్యాచారం, లైంగికదాడియత్నం కేసు ల్లో ఇద్దరు నిందితులకు జీవితఖైదు పడింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గుండివాగుకు చెందిన గిరిజన మహిళపై షేక్‌ఇసా లైంగికదాడికి యత్నించాడు. బాధితురాలు ఫిర్యాదుతో ఇచ్చోడ పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం ప్రత్యేక పీపీ రమణారెడ్డి కేసు రుజువు చేయగా, ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి జీవిత ఖైదుతోపాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. కరీంన గర్ జిల్లా రామడుగు ప్రేమ పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన నేరంలో నిందితుడు మచ్చ అజయ్(20)కు జీవిత ఖైదు, రూ.40 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎస్ శ్రీనివాస్‌రెడ్డి గురువారం తీర్పునిచ్చారు.

562
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles