దొంగపట్టా నిజమే


Sun,June 16, 2019 02:02 AM

The son who guarded the land of the parents

-తల్లిదండ్రుల భూమిని కాజేసిన కొడుకు
-ఎమ్మారై విచారణలో తేలిన నిజం
-కన్నవారి భూమిని కాజేశాడు కథనానికి స్పందన

కొల్లాపూర్, నమస్తే తెలంగాణ: కన్నవారి భూమిని కాజేశాడు శీర్షికతో శనివారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల రెవెన్యూ అధికారులు స్పందించారు. శనివారం మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బలరాంనాయక్ కల్వకోలు గ్రామానికి వచ్చి విచారణచేశారు. ఎమ్మారై సూచనమేరకు గ్రామ సేవకులు.. బాధిత రైతు కుటుంబీకులు, ఆక్రమణదారుడితోపాటు ఆ వ్యవసాయ పొలాల సరిహద్దులో ఉన్న రైతులను గ్రామపంచాయతీలో నిర్వ హించిన విచారణకు తీసుకొచ్చారు. బాధితురాలైన గడ్డమీది బిచ్చమ్మ పేరు మీద పట్టా ఉన్న భూమికి సం బంధించిన పాస్‌పుస్తకాన్ని ఎమ్మారై బలరాంనాయక్ పరిశీలించారు. ఈ సర్వే నంబర్ 155లో 5.14 ఎకరాల భూమి విస్తీర్ణానికి 2.27 ఎకరాల భూమిని అందులో నుంచి ఆమె పెద్దకొడుకు గడ్డమీది కుర్మయ్య దొంగ పట్టాచేసుకున్నాడని విచారణలో తేల్చారు.

సదరు భూమిలో కాస్తులో ఎవరున్నారని పక్క పొలం రైతు బాలస్వామిని అడిగితే బిచ్చమ్మనే ఉన్నట్టు బాలస్వామి చెప్పారు. కుర్మయ్య తండ్రి గడ్డమీది కృష్ణయ్యకు చెందిన సర్వే నంబర్ 71లో 13 గుంటలు, మరో సర్వే నంబర్ 88లో 12 గుంటల భూమిని కూడా పెద్దకొడుకు గడ్డమీది కుర్మయ్య దొంగపట్టా చేసుకున్నట్టు విచారణలో తేలింది. తోబుట్టువులైన చెన్నమ్మ, ఎల్లమ్మకు సర్వే నంబర్ 93లో 2.15 ఎకరాల భూమి ఉండగా, అందులో నుంచి 1.15 ఎకరాలను కూడా కుర్మయ్య దొంగతనంగా పట్టాచేసుకున్నట్టు ఎమ్మారై బలరాంనాయక్ గ్రామస్థుల సమక్షం లో ప్రకటించారు. గడ్డమీది కుర్మయ్య.. తన కుటుంబ సభ్యులకు చెందిన 4.27 ఎకరాలను అక్రమం గా పట్టాచేసుకొన్నట్టు తెలిపారు. విచారణ నివేదికను తాసిల్దార్‌కు అం దజేయనున్నట్టు ఎమ్మారై చెప్పారు. ఈ విచారణలో గ్రామపెద్దలు గొల్ల వెంకటస్వామియాదవ్, జంపయ్య, గిరిప్రసాద్, పూజారి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Dharmaganta1

1040
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles