స్మార్ట్‌గ్రిడ్‌తో విద్యుత్ సమస్యలకు చెక్


Tue,April 16, 2019 01:26 AM

The pilot project will begin on January 22 at jeedimetla

22న జీడిమెట్లలో పైలెట్‌ప్రాజెక్ట్ ప్రారంభం
జీడిమెట్ల: రాష్ట్రంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన స్మార్ట్‌గ్రిడ్‌ను ఈ నెల 22న ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ స్మార్ట్‌గ్రిడ్ అందుబాటులోకివస్తే.. 12వేల మంది వినియోగదారులకు తక్షణ సేవలతోపాటు విద్యు త్ ఫీడర్లలో తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించే వీలుంటుంది. కేంద్ర విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన స్మార్ట్‌గ్రిడ్ పనులపై.. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ప్రత్యేకదృష్టి సారించడంతో పనులు త్వరితగతిన పూర్తయ్యాయి. రూ.33కోట్లతో చేపట్టిన ఈ పనులను డబ్ల్యూఐఎన్‌ఏఎమ్మార్, ఈసీఐఎల్ సంస్థలు నిర్వహిస్తున్నాయని, ఇన్‌స్టలేషన్, కమ్యూనికేషన్ పనులు పూర్తయ్యాయని డీఈ గరుత్మంత్‌రాజు వివరించారు.

smart-grid2

స్మార్ట్‌గ్రిడ్ ఎలా పనిచేస్తుందంటే..

జీడిమెట్ల పారిశ్రామికవాడలో సుమారు 16 కిలోమీటర్ల విస్తీర్ణంలో విద్యుత్ ఫీడర్లను ఏర్పాటుచేశారు. వీటికి సెక్షన్ అనలైజర్లు, ఫాల్ట్‌ఫాస్ ఇండికేటర్, రింగ్‌మేన్ యూనిట్లతోపాటు స్మా ర్ట్‌మీటర్లను అమర్చుతారు. వాటిని విద్యుత్ కార్యాలయాలకు, స్కాడా కేంద్రానికి అనుసంధానిస్తారు. ఈ పరికరాలు విద్యుత్ సరఫరాలో ఏదైనా లోపం తలెత్తితే ఎస్‌ఎమ్మెస్ రూపంలో ఆయా కేంద్రాలకు సమాచారం అందించడంతోపాటు కంప్యూటర్‌లో కూడా చూపిస్తాయి. దీంతో విద్యుత్ సిబ్బంది నేరుగా ఆ ప్రాంతానికి వెళ్లి.. నిమిషాల్లో సమస్య పరిష్కరిస్తారు. స్మార్ట్‌గ్రిడ్ వల్ల సమస్యను సులభంగా గుర్తించడం, పరిష్కరించడంతోపాటు నాణ్యమైన సేవలను అందించవచ్చు. సరఫరాను స్థానిక అధికారులు తమ ఇష్టానుసారం గా నిలిపివేస్తే ఉన్నతాధికారులు వెంటనే గ్రహిస్తారు. ఐదు సబ్‌స్టేషన్ల పరిధిలో 43 ఫీడర్లలో 12,014 స్మార్ట్‌మీటర్లు, 77 ఆటో రీక్లోజర్స్, 89 సెక్షనైజర్స్, 62 ఆర్‌ఎంయూలు, 176 ఎఫ్‌పీఐ పరికరాలను అమర్చుతున్నారు.

503
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles