తాటివనం దగ్ధం


Tue,April 16, 2019 01:22 AM

The palm forest is accidentally burned

-కాలిన 500 తాటి, ఈత చెట్లు
-రెండు మిల్లులకు తప్పిన పెను ప్రమాదం

పరకాల, నమస్తే తెలంగాణ: వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణ శివారులోని మల్లక్కపేట ఆర్చి సమీపంలో గల తాటివనం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. పరకాల-మొగుళ్లపల్లి ప్రధానరహదారి పక్కన సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. మంటలు చెలరేగి కుంట కట్టకు ఇరువైపులా ఉన్న తాటిచెట్లు ఒకదానికొకటి కాలుతూ మల్లక్కపేట రోడ్డులోని మహేశ్వర, శ్రీరామ ఇండస్ట్రీస్ వరకు వ్యాపించాయి. మిల్లుల్లో ఉనక ఉండటంతో భీకరమైన మంట లు లేచాయి. పరకాల అగ్నిమాపక సి బ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో పరకాల ఏసీపీ సుధీంద్ర, సీఐ మధు ములుగు, హుజూరాబాద్, కేటీపీపీ, హన్మకొండ ఫైర్‌స్టేషన్లకు సమాచారం అందించారు. గణపురం మండలం చెల్పూరులోని కేటీపీపీలోని ఫైర్ ఇంజిన్ టాప్ నుంచి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.మొత్తం మూడు ఫైర్‌ఇంజిన్లు రెండున్నర గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

686
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles