మొక్కలు తిన్నాయని మేకలను బంధించారు


Thu,September 12, 2019 02:59 AM

The officers captured the goats who ate the haritha haram plants

ఆత్మకూరు(ఎం)/మక్తల్ రూరల్: హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను తిన్నాయని మేకలను బంధించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)లో జరుగగా, నారాయణపేట జిల్లాలో మేకల యజమానికి రూ.1 0 వేలు జరిమానా విధించారు. ఆత్మకూరు(ఎం) అంగడి ప్రదేశంలో నాటిన మొక్కలను బుధవారం మేకలు తినడం ఎంపీడీవో రాములు గమనించి.. సిబ్బందిని పిలిపించి మేకలను పంచాయతీ కార్యాలయంలో బంధించారు. అనంతరం మేకల యజమానులను పిలిపించి మాట్లాడనున్నట్టు అధికారులు తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో రైల్వేస్టేషన్ పరిసరాలలో నాటిన మొక్కలను మూడు మేకలు మేయగా, ఎంపీడీవో పావని, తాసిల్దార్ శ్రీనివాస్ మేకల యజమానికి రూ.10 వేల జరిమానా విధించారు.

135
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles