ఆ చేపలు తినేవారిలో పాదరసం స్థాయి ఎక్కువే


Wed,June 12, 2019 01:15 AM

The level of mercury in fish eaten

-ఐఐటీ హైదరాబాద్ పరిశోధనలో వెల్లడి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: బొగ్గు మండించే ప్లాంట్ల సమీపంలో లభించే చేపలు తినడం వల్ల శరీరంలో పాదరసం స్థాయి అధికం అవుతుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. హైదరాబాద్, నెల్లూరు, వాస్కోడిగామ నగరాల్లో 600 మంది నివాసితుల వెంట్రుకలపై పరిశోధన చేసింది. పాదరసం అనేది ఒక విష పదార్థం. వివిధ రూపాల్లో ఇది పర్యావరణంలోకి ప్రవేశిస్తున్నది. కలుషిత వాతావరణంలో లభించే ఆహారం.. ముఖ్యంగా చేపలు, బియ్యం ద్వారా మానవ శరీరంలోకి వెళ్తుంది. బొగ్గు మండించడం వల్ల పెద్దమొత్తంలో పాదరసం వాతావరణంలోకి విడుదలవుతున్నది అని ఐఐటీ హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిఫ్ ఖురేషీ తెలిపారు. 2020 నాటికి మన దేశంలో 540 టన్నుల పాదరసం వ్యర్థాలు వాతావరణంలో కలుస్తాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఇది దేశ ప్రజల ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండెపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.

1496
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles