రెండురోజుల్లోనే వన్ బీ, పహాణీలు


Sat,May 25, 2019 01:40 AM

The land of the deceased was picked up in Pahanan

-ఊర చెరువు కబ్జాదారులకు ఊతం కథనానికి స్పందించిన రెవెన్యూశాఖ
-నీర్మాలలో మాయమైన భూమిని పహాణీలో ఎక్కించిన దేవరుప్పుల తాసిల్దార్

దేవరుప్పుల: మాయమైన భూమిని తిరిగి పహాణీలో ఎక్కించారు. బాధితులకు ఒక్కరోజులోనే 1బీ, రెండురోజుల్లోనే పహాణీలు ఇచ్చేశారు. ధర్మగంటలో ప్రచురితమైన ఊరచెరువు కబ్జాదారులకు ఊతం కథనానికి రెవెన్యూ సిబ్బంది తక్షణం స్పందించారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాలకు చెందిన బండ విజయ, స్రవంతికి అదే గ్రామంలోని 179 సర్వే నంబర్‌లో 6.15 ఎకరాల భూమి ఉన్నది. పదహారేండ్లుగా వీరు పట్టా భూమిని సాగు చేసుకుంటున్నారు. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కొత్త పాస్‌పుస్తకాలు వీరికి రాకపోగా మొత్తం భూమి పహాణీ నుంచి మాయమైంది. ఈ భూమి కోసం గతేడాదిగా రెవెన్యూ అధికారులతో వీరు పోరాడుతున్నారు. విసిగివేసారిపోయిన బాధితులు చివరికి నమస్తే తెలంగాణ -ధర్మగంటను ఆశ్రయించడంతో ఈ నెల 22 న ఊర చెరువు కబ్జాదారులకు ఊతం శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఉన్నతాధికారు ల ఆదేశాల మేరకు స్పందించిన తాసిల్దార్ ఫరీదుద్దీన్, వీఆర్వో సోమయ్య రికార్డులన్నీ తిరగేసి పహాణీలో వారి పేర్లను ఎక్కించారు. 1బీని బాధితులైన బం డ విజయ, స్రవంతికి అందజేశారు. రెవెన్యూ అధికారుల వల్ల తాము రెం డు విడుతల పంట పెట్టుబడి కోల్పోయామని.. తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

2320
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles