చేపల వలలో భారీ కొండచిలువThu,October 12, 2017 11:31 AM

kondachiluva
జిన్నారం: చేపల కోసం వేసిన వలలో భారీ కొండచిలువ చిక్కుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని అక్కమ్మ చెరువు వద్ద జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు అలుగుపోస్తున్నది. ఈ క్రమం లో బుధవారం మత్స్యకారులు చేపలకోసం వలవేశారు. తర్వాత వలను తీయడానికి వెళ్లగా కొండచిలువ కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. ధైర్యం చేసి వలలో నుంచి దానిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా జారిపోయి తిరిగి చెరువులోకి వెళ్లింది. అది సుమారు 12 అడుగులు ఉన్నదని మత్స్యకారులు తెలిపారు.

2735
Tags

More News

VIRAL NEWS