మూడుకోట్లకు చేరువలో గ్రీన్ చాలెంజ్


Thu,September 12, 2019 02:42 AM

The Green Challenge is the closest to three crores

-పచ్చదనం కోసం ఉద్యమస్ఫూర్తితో మొక్కల పెంపకం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఉద్యమరూపు దాల్చింది. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ పిలుపుతో.. ఇంతింతై వటుడింతై అన్నట్టు మూడుకోట్ల మొక్కలకు చేరువైంది. వనహారతికి మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా భాగస్వాములవుతున్నారు. ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ మొదట గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీన్ని రాష్ర్టానికే పరిమితం చేయకుండా దేశ ప్రజలను ఇందులో భాగస్వాములను చేయాలనే తలంపుతో సంస్థ ప్రతినిధులు.. ఎంపీ సంతోష్‌కుమార్‌ను కలిసి గ్రీన్ చాలెంజ్‌లో పాల్గొనాలని కోరారు. స్వతహాగా ప్రకృతి ప్రేమికుడైన సంతోష్‌కుమార్ అందుకు అంగీకరించారు. గ్రీన్ చా లెంజ్‌లో మొదటి మొక్కను సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌తో నాటించారు. ఒక్క కోటి మొక్కను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నాటారు. రెండో కోటి మొక్కను ఎంపీ సంతోష్‌కుమార్ స్వయంగా నాటి మళ్లీ చాలెంజ్ విసిరారు. ప్రస్తుతం గ్రీన్ చాలెంజ్ మూడుకోట్ల మొక్కలకు చేరువైంది.

ఇప్పటికే పద్మశ్రీ జాదవ్ పయోంగ్, పద్మశ్రీ వనజీవి రామయ్య, కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, హర్షవర్ధన్, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, సినీనటులు చిరంజీవి, నాగార్జున, క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, పుల్లెల గోపీచంద్, కిదాంబి శ్రీకాంత్, పీవీ సింధు, సానియామీర్జా, సైనా నెహ్వాల్, ద్యుతిచంద్, సిక్కిరెడ్డి తదితరులు మొక్కలు నాటి గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు ఊపు తెచ్చారు. ఒకరికొకరు సవాల్ విసురుకుంటూ మొక్కలు నాటుతున్నారు. పర్యావరణ పరిరక్షణ, హరితవిశ్వం కోసం మొదలుపెట్టిన మహాక్రతువులో భాగస్వాములై అందరి కృషితో త్వరలో పదికోట్ల మొక్కలకు చేరువవుతామని ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ ప్రతినిధులు ఆశాభావంతో ఉన్నారు.

83
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles