తెలుగుకు తమిళిసై

Sat,November 9, 2019 01:17 AM

మన భాషపై పట్టుకు గవర్నర్ సాధన.. ట్యూటర్‌గా ఆవుల మంజులత ఎంపిక
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తెలుగు నేర్చుకొంటున్నారు. తెలుగు భాషపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు ప్రత్యేక సాధన చేస్తున్న ఆమె.. ఇందుకోసం తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్‌చాన్స్‌లర్, ప్రముఖ రచయిత ఆవుల మంజులతను గురువుగా ఎంచుకొన్నారు. రోజూ సాయంత్రం ఆమె గవర్నర్‌కు తెలుగు నేర్పుతున్నట్టు సమాచారం. సెప్టెంబర్ 10న తెలంగాణ గవర్నర్ పదవి చేపట్టిన తమిళిసై సౌందర్‌రాజన్.. ఎక్కడికి వెళ్లినా తెలంగాణ అభివృద్ధితోపాటు ఇక్కడి సంస్కృతి గొప్పతనం గురించి వివరిస్తున్నారు. ఆమె మాతృభాష తమిళం అయినప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌కు చెందిన తమిళిసై సౌందర్‌రాజన్‌కు తెలుగు భాషపై ఇదివరకే కొంత అవగాహన ఉన్నది. ఒకట్రెండు నెలల్లో తెలుగుపై పట్టు సాధించాలన్న కృతనిశ్చయంతో సాధన చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె రాజ్‌భవన్‌లో సిబ్బంది, అధికారులతో తెలుగులోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది.

852
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles