సమరయోధుడి భూమి ఇతరులకు పట్టా


Mon,August 26, 2019 01:39 AM

The freedom fighters land graduated to others

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మహబూబ్‌నగర్ జిల్లాలోని ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదానం గ్రామంలోని సర్వే నంబర్ 147/144లో రెండెకరాల భూమిని స్వాతంత్య్ర సమరయోధుడు ఎన్ అచ్చయ్యకు ప్రభుత్వం ఇచ్చింది. 2005లో అచ్చయ్య పేరిట రెండెకరాల భూమి పట్టా అయింది. అచ్చయ్య ఆ భూమిని సాగుచేయకుండా పడావుపెట్టారు. దీంతో అక్రమార్కుల కన్ను ఆ భూమిపై పడింది. అచ్చయ్య ప్రమేయంలేకుండానే ఆ భూమిని ఇతరులు పట్టా చేసుకున్నారు. ఇందుకు రెవెన్యూ అధికారులు సహాయపడ్డారు. 2010లో అచ్చయ్య మరణానంతరం అతని కుమారుడు జయరాం తన తండ్రి నుంచి వారసత్వంగా రావాల్సిన భూమి గురించి పోరాడుతున్నారు.

తాసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. రెండెకరాల భూమిని తనకు విరాసత్‌చేయాలని వేడుకొంటున్నారు. ఇదే విషయమై రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండల తాసిల్దార్ రాజేశ్వర్‌రెడ్డిని నమస్తే తెలంగాణ సంప్రదించగా.. తనకు ఈ విషయంపై ఎలాంటి దరఖాస్తు అందలేదని, గతంలో ఒకసారి మాత్రం తన నోటీస్‌లోకి వచ్చిందని చెప్పారు. డాక్యుమెంట్లు చూపించాలని అడిగితే జయరాం చూపించడం లేదని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుడు అని చెప్తున్నారని అందుకు ఆధారాలు అడిగితే చూపించడం లేదని తాసిల్దార్ చెప్పారు. డాక్యుమెంట్లు చూపిస్తే.. సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.

335
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles