తొలి ప్రాధాన్యం రైతులేFri,February 23, 2018 02:33 AM

-ఎకరం కూడా ఎండనివ్వం యాసంగిలో ఎల్‌ఎండీ పరిధిలో తడులవారీగా నీళ్లు
-ఎస్సారెస్పీపై సమీక్షలో మంత్రి ఈటల రాజేందర్

resized_RTN
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని, నాణ్యమైన కరెంటు, నీళ్లు, పంటకు గిట్టుబాటు ధర కోసం అనుక్షణం ఆరాటపడుతున్నామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. యాసంగిలోఎకరం కూడా ఎండిపోకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులతో కరీంనగర్ జిల్లాను సస్యశ్యామలం చేయబోతున్నామని గురువారం సచివాలయంలో ఎస్సారెస్పీ నీటి పంపిణీపై జరిగిన సమీక్ష మంత్రి ఈటల వెల్లడించారు. ప్రస్తుతం ఎగువ ఎల్‌ఎండీకి 5,6,7,8 తడులు, దిగువ ఎల్‌ఎండీకి మరో మూడు తడుల నీళ్లు ఇచ్చే అంశంపై చర్చించారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 27 టీఎంసీలు, ఎల్‌ఎండీలో 10 టీఎంసీల నీళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఎగువ ఎల్‌ఎండీలో 5, 6 తడులకు ఒక్కో తడి ఏడు రోజులు, 7, 8 తడులకు ఒక్కో దానికి 6 రోజులపాటు నీళ్లు ఇవ్వాలని, దిగువ ఎల్‌ఎండీకి 4వ తడికి 7రోజులు, 5, 6వ తడులకు 6 రోజులు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి ఈటల తెలిపారు. వానాకాలంలో దోమకాటుతో పంటలు నష్టపోయామని, యాసంగికి నీళ్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు కలిసి విన్నవిస్తే.. మంజీర నీళ్లను సింగూరు నుంచి ఎస్సారెస్పీకి మీదుగా ఇచ్చారని గుర్తుచేశారు. ఆ నీటితో ఎగువ ఎల్‌ఎండీ పరిధిలో నాలుగు లక్షల ఎకరాలు, సరస్వతి కాల్వ ద్వారా ఆదిలాబాద్‌కు, ఎత్తిపోతల ద్వారా నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల పంటను కాపాడుతున్నామని చెప్పారు.

పొలాలపైనా ప్రతిపక్షాల రాజకీయం

పంట ఎండిపోకూడదని ప్రభుత్వం కష్టపడుతుంటే, కొందరు ప్రతిపక్ష నేతలు పొలాలు ఎండిపోవాలని.. వాటిపైన రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. సమీక్షలో పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, పెద్దపల్లి కలెక్టర్ దేవసేన ఉన్నారు.

1097

More News

VIRAL NEWS