తప్పులు సరిచేయట్లేదు


Thu,May 16, 2019 02:14 AM

The fault of the revenue officers has become a curse to the farmer

ఎడపల్లి: అధికారుల తప్పిదం రైతుకు శాపంగా మారింది. తప్పుగా రాసిన సర్వేనంబర్‌ను సరిచేయాలని ఏడాదిగా తిరుగుతున్నా పట్టించుకొనేవారే కరువయ్యారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రైతు జనార్దన్‌రావుకు తండ్రి నుంచి వారసత్వంగా 2 ఎకరాల 20 గుంటల భూమి వచ్చింది. ఎడపల్లి గ్రామ రెవెన్యూ శివారులో 556లో ఎకరం 33 గుంటలు, 564లో 27 గుంటల భూమి ఉన్నది. పట్టామార్పిడి సమయంలో రెవెన్యూ అధికారులు జారీచేసిన పట్టాదారు పాస్‌పుస్తకంలో 556లో 33 గుంటలు మాత్రమే ఉన్నట్టు, 564లో ఎకరం 27 గుంటలు ఉన్నట్టు నమోదుచేశారు. ఇదే విస్తీర్ణం ఆన్‌లైన్‌లో కూడా నమోదుచేశారు. తప్పు చేశారని, పొరపాటును సరిచేయాలని జనార్దన్‌రావు రెవెన్యూ కార్యాలయం చుట్టూ ఏడాదిగా తిరుగుతున్నా.. సరిచేసి కొత్త పాస్‌పుస్తకం ఇవ్వడంలేదు.

సరిదిద్దడంలేదు


జనార్దన్‌రావు, రైతు బ్రాహ్మణపల్లి

పట్టాదారు పాస్‌పుస్తకంలో అధికారులు తప్పుగా నమోదుచేసిన భూ వివరాలను సరిచేయాలని ఏడాది నుంచి తిరుగుతున్నా. రికార్డులు సరిచేసి.. కొత్త పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వడంలేదు. ఫలితంగా రైతుబంధు, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పంటపెట్టుబడి డబ్బు రాలేదు.

77
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles