ప్రశాంతంగా ప్రయాణం

Sun,October 13, 2019 02:53 AM

-పక్కాగా ప్రభుత్వ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
-రాష్ట్రంలో రోడ్డెక్కిన పదివేలకుపైగా బస్సులు
-ఎనిమిదో రోజూ కనిపించని సమ్మె ప్రభావం
-పూర్తిస్థాయిలో బస్సులు నడుపడంపై ప్రభుత్వం కసరత్తు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సత్ఫలితాలిస్తున్నాయి. రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులు అందుబాటులో ఉండటం తో పండుగకు వెళ్లిన వారి తిరుగు ప్రయాణాలు ప్రశాంతంగా సాగుతున్నాయి. శనివారం ఆర్టీసీ, అద్దె, ప్రైవేటు కలుపుకొని మొత్తం పది వేల వాహనాలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాయి. దాదాపు 55 శాతం ఆర్టీసీ బస్సులు తిరిగాయి. ఫలితంగా ఎనిమిదో రోజైనా శనివారం కూడా సమ్మె ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో బస్సులను నడిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. టికెట్లు ఇవ్వడం వంటి అంశాలపైనా దృష్టిపెట్టింది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు మధ్య బస్సులు ఎక్కువ రాకపోకలు కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నది. డిపోల వద్ద భద్రతతోపాటు, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక కండక్టర్లు ప్రయాణికుల నుంచి టికెట్ ధరకు అదనంగా డబ్బులు వసూలు చేయకుండా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపో పరిధిలో వందశాతం బస్సులు పూర్తిస్థాయిలో సేవలు అందించాయి.

tsrtc2
- కరీంనగర్ రీజియన్‌లోని నాలుగు జిల్లాల్లో శనివారం 670 బస్సులకుగాను 568 బస్సులు నడిపారు. ఇందులో 366 ఆర్టీసీ, 202 అద్దె బస్సులున్నాయి. ఇవికాకుండా 19 స్కూల్, 62 కాంట్రాక్టు క్యారియర్ బస్సులు, 230 మాక్సీక్యాబ్‌లు నడిపారు.
-సంగారెడ్డి రీజియన్‌లోని ఎనిమిది డిపోల పరిధిలో 496 బస్సులు తిరిగాయి. వీటిలో 339 ఆర్టీసీ, 157 ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. మెదక్ డిపోలో 98 బస్సులకు 45, నారాయణఖేడ్‌లో 57 బస్సులకు 51, సంగారెడ్డిలో 100 బస్సులకు 96, సిద్దిపేటలో 105 బస్సులకు 92, గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌లో 69 బస్సులకు 69, జహీరాబాద్ డిపోలో 93 బస్సులకు 67, దుబ్బాకలో 40 బస్సులకు 29, హుస్నాబాద్ డిపోలో 55 బస్సులకుగాను 47 బస్సులు నడిచాయి.
-నల్లగొండ జిల్లాలోని నాలుగు డిపోల నుంచి 292 బస్సుల ద్వారా 60 నుంచి 70 వేల వరకు ప్రయాణికులను చేరవేశారు.
-సూర్యాపేట జిల్లాలోని కోదాడ డిపోలో 60 బస్సులకుగాను 42 ఆర్టీసీ, 31 అద్దె బస్సులు నడిచాయి. సూర్యాపేట డిపోలో 74 ఆర్టీసీ బస్సులకు 67 తిరిగాయి. 45 అద్దెబస్సులు ఉండగా 45 సేవలందించాయి. ఇవేకాకుండా ప్రైవేటు వాహనాలు నడిచాయి.
-ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ డిపోలో 80 శాతం, ఆదిలాబాద్ డిపోలో 60 శాతం బస్సులు తిరిగాయి.
-జనగామ జిల్లాలో 78 ఆర్టీసీ, 20 అద్దె, 18 ప్రైవేట్ స్కూల్ బస్సులు నడిచాయి.
-ఖమ్మం జిల్లాలో 365 బస్సులను నడిపారు. ఖమ్మం డిపోలో 36 ఆర్టీసీ, 48 హైర్ బస్సులు, మధిర డిపోలో 30 ఆర్టీసీ, 21 అద్దె
బస్సులు, సత్తుపల్లిలో 60 ఆర్టీసీ, 30 హైర్ బస్సులు, 60 ప్రైవేట్ బస్సులను నడిపారు. 80 మ్యాక్సీక్యాబ్‌లు తిరిగాయి.
-వికారాబాద్ జిల్లాలోని మూడు డిపోల పరిధిలో 172 బస్సులు తిరిగాయి. వికారాబాద్ డిపోలో 82 బస్సులకు 63 తిరిగాయి. ఇందులో ఆర్టీసీ 39, ప్రైవేటు 24 బస్సులు ఉన్నాయి. తాండూరు డిపోలో 93 బస్సులకు, 69 తిరిగాయి. ఇందులో ఆర్టీసీ 43, ప్రైవేటు బస్సులు 26 ఉన్నాయి. పరిగి డిపోలో 87 బస్సులకు 40 నడిపారు.
-మంచిర్యాల డిపోలో 38 ఆర్టీసీ బస్సులు, 50 హైర్, 18 ప్రైవేటు బస్సులు, 60 క్యాబ్‌లు నడిచాయి. ఇవేకాకుండా 40 నుంచి 60 వర కు ఆటోలు, టాటాఏస్ ట్రాలీలు తిరిగాయి.
-మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 68 ఆర్టీసీ, 32 అద్దె,70 ప్రైవేటు బస్సులు నడిచాయి. 17 వేల మందికిపైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాయి.

tsrtc3

సమ్మె కొనసాగిస్తాం

భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ
తమ డిమాం డ్లను నెరవేర్చుకునేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. శనివారం నారాయణగూడలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో అఖిలపక్షాలతో ఆర్టీసీ జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ తదుపరి కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 13 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా వంటావార్పు, డిపోల ఎదుట బైఠాయింపు, రాస్తారోకోలు, విద్యార్థి సంఘాల ర్యాలీలు, ధూంధాం కార్యక్రమాలు, బైక్ ర్యాలీలు నిర్వహించాలని కోరారు. ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు.
tsrtc4

1411
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles