సూర్యాపేట కలెక్టర్‌కు ధన్యవాదాలు


Tue,August 13, 2019 02:09 AM

thanks for suryapet collector

వాట్సప్‌లో మెసేజ్‌చేస్తే భూసమస్యను పరిష్కరించారు
మాది సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం అడ్లూరు. నాకు అడ్లూరులోని సర్వే నంబర్లు 85లో 2.24 ఎకరాలు, 178/9లో ఎకరం, 84/ఆలో 1.20 ఎకరాలు.. మొత్తం 5.04 ఎకరాల భూమి ఉన్న ది. ఈ భూమి మా నాన్న నుంచి వారసత్వంగా సంక్రమించింది. ఈ భూమిని నా పేరిట మార్చేందుకు రెండేండ్ల నుంచి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూ అధికారులకు పలుసార్లు అర్జీలు పెట్టుకొన్నాను. అయినా అధికారులు ఎవరూ స్పందించలేదు. ఇటీవల జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్‌కు వాట్సప్‌లో నా భూసమస్యను పోస్టు చేశాను. వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. నా భూసమస్యను పరిష్కరించి నాకు రెండు రోజుల కింద పాస్‌పుస్తకం జారీచేశారు. కలెక్టర్ అమయ్‌కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.
- ఈపూరి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరు, సూర్యాపేట జిల్లా

196
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles