‘తల్లివేరు’ ఆవిష్కరణ


Fri,June 9, 2017 01:40 AM

Thalliveru Poetry collection innovation

home
-మూలాలను వెతుక్కొనే సంకలనమని అభినందించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ మట్టివాసనల తల్లివేరు కవితా సంకలనాన్ని సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. తెలంగాణ పునర్నిర్మా ణానికి కృషి జరుగుతున్న కాలంలో తమ మూలాలను వెతుక్కునే సంకలనం ప్రచురించారని సాంస్కృతికశాఖను అభినందించారు. భాషా, సాంస్కృతికశాఖ.. రవీంద్రభారతిలో నిర్వహించిన హేవళంబి నామ ఉగాది కవి సమ్మేళనం - 2017లో పాల్గొన్న కవుల కవితలను ఒకచోటకు చేర్చి తల్లివేరును ప్రచురించింది. ఇటీవల రవీంద్రభారతి ప్రాంగణాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్ సాహిత్య అకాడమీ, సాంస్కృతికశాఖ సంచాలకుల కార్యాలయాలను సం దర్శించారు.

ఈ సందర్భంగా ఉగాది కవితా సంకలనాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీఎస్ ఎస్పీ సింగ్, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సాంస్కృతికశాఖ కార్యదర్శి బీ వెంకటేశం, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణతో కలిసి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. హృదయాన్ని హత్తుకునే కవితలను ఆకట్టుకునేలా ప్రచురించారని సీఎం కేసీఆర్ ప్రశంసించారని మామిడి హరికృష్ణ తెలిపారు.

336
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS