దిశ ఘటనను ఖండించిన టీజీవో

Thu,December 5, 2019 02:15 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దిశ ఘటనను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. బుధవారం టీజీవో భవన్‌లో సమావేశమైన సంఘం మహిళావిభాగం సభ్యులు.. దిశకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలుచేశారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మహిళల భద్రతపై అవగాహన సదస్సును పోలీస్‌శాఖ నిర్వహించాలని, మహిళా ఫీల్డ్ ఆఫీసర్లు సురక్షిత ప్రదేశాల్లో విధులు నిర్వర్తించేందుకు తగిన పరిస్థితులు కల్పించాలని, మహిళా అధికారులపై వేధింపులను అరికట్టేందుకు తక్షణమే ప్రతి కార్యాలయంలో మహిళా అధికారులతో కమిటీ ఏర్పాటుచేయాలని తీర్మానా లుచేశారు.


రాష్ట్రంలో అటెండర్ స్థాయినుంచి అధికారిస్థాయి వరకు మహిళలకు ఎప్పుడైనా ఎలాంటి అవసరం వచ్చినా టీజీవో మద్దతు ఉంటుందని ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బోర్డులు, ఫ్లెక్సీలతో షీటీంలు, డయల్ 100, హాక్ ఐ వంటి వాటిని ప్రదర్శించాలని, దీంతో మహిళల్లో ధైర్యం నింపినట్టు అవుతుందన్నారు. సమావేశంలో టీజీవో అధ్యక్షురాలు వీ మమత, సుజాత, స్వర్ణలత, శారద, సునీతజోషి, స్వరూపారాణి, రాధ, రేవతి, కిరణ్మయి, సుజాత, రామలక్ష్మి, లలిత తదితరులు పాల్గొన్నారు.

159
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles