మార్చికల్లా యూనిఫాం

Tue,January 22, 2019 02:13 AM

- 24 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు లబ్ధి
- 1.30 కోట్ల మీటర్ల క్లాత్ తయారీకి టెస్కో ఏర్పాట్లు
- సిరిసిల్ల మరమగ్గాలపై తయారీ ప్రారంభం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందజేసే యూనిఫాం క్లాత్‌ను మార్చి నెలాఖరుకల్లా ఆయా స్కూళ్లకు పంపిణీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 24 లక్షలమంది విద్యార్థులకు దాదాపు 1.30 కోట్ల మీటర్ల క్లాత్‌ను సరఫరాచేసేందుకు టెస్కో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సిరిసిల్ల మరమగ్గాలపై ఈ క్లాత్ తయారీని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్యను పెంచాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా యూనిఫాం ను ఉచితంగా అందజేస్తున్నాయి. రెండు జతల యూనిఫాంకు అవసరమైన క్లాత్‌తోపాటు కు ట్టుకూలీ కూడా ప్రభుత్వమే భరిస్తున్నది. ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులతోపాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల విద్యార్థులకు అవసరమైన యూనిఫాం క్లాత్‌ను కూడా తయారుచేయిస్తున్నారు. చేనేత కళాకారుల ద్వారా ఎంత క్లాత్‌ను తయారుచేసే సామర్ధ్యం ఉంటే.. అంత క్లాత్‌ను వారినుంచి కొనుగోలుచేసేందుకు సిద్ధమని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనిని గురుకుల రెసిడెన్షియల్ విద్యార్థులకు సరఫరాచేయనున్నారు.

అంతేకాకుండా, కేసీఆర్ కిట్స్‌లో అందించే చీరలను కూడా మరమగ్గ కార్మికుల ద్వారా తయారుచేయించి సరఫరాచేస్తున్నారు. ప్రతి నెలా యాభైవేల చీరలను కేసీఆర్ కిట్స్ కోసం సరఫరాచేస్తున్నారు. ముస్లింలకు రంజాన్ సందర్భంగా అం దించే తోఫాలను ఈసారి మే నెలలో అందించనున్నారు. వీటిద్వారా మరమగ్గ కార్మికులకు చేతినిండా పనిదొరుకనున్నది. నేతన్నలకు చేతినిండా పనికల్పించడమే కాకుండా వారికిచెల్లించే కూలీరేట్లను కూడా భారీగా పెంచారు. మరమగ్గ కార్మికులకు నెలకు ఇరువైవేల రూపాయల వరకు ఆదాయం లభించేవిధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

ప్లస్ టూకి కూడా

ఇప్పటివరకు పదోతరగతి వరకే ఉచిత యూనిఫాంను అందజేస్తుండగా, ఈ ఏడాది నుంచి ప్లస్ టూ విద్యార్థులకు కూడా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యేనాటికి విద్యార్థులకు కొత్త యూనిఫాం చేరాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం విద్యాసంవత్సరం చివరలోనే దానిని అందజేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నది. గతేడాది కూడా విద్యాసంవత్సరం ముగింపులోనే యూనిఫాంను అందించారు.

1999
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles