లాభసాటి వ్యవసాయం దిశగా తెలంగాణ


Fri,July 12, 2019 01:46 AM

Telangana towards profitable agriculture

తెలంగాణ వ్యవసాయం-దిక్సూచి పుస్తకావిష్కరణలో మంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: లాభసాటి వ్యవసాయం దిశగా రాష్ట్ర రైతాంగాన్ని తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర రైతులు, క్షేత్రస్థాయి సిబ్బంది కోసం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ముద్రించిన తెలంగాణ వ్యవసాయం- దిక్సూచి అనే పుస్తకాన్ని గురువారం సచివాలయంలో మంత్రి విడుదలచేశారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ డాక్టర్ వీ ప్రవీణ్‌రావు, అధికారులు, భారత పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర ప్రతినిధులు అనిల్ వీ ఏపూర్, ఎస్ రాజశేఖర్‌రెడ్డి, కే గోపీనాథ్ పాల్గొన్నారు. తెలంగాణ వ్యవసాయాధికారులు రూపొందించిన హ్యాండ్‌బుక్‌ను కూడా మంత్రి నిరంజన్‌రెడ్డి విడుదలచేశారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారుల సంఘం చైర్మన్ కృపాకర్‌రెడ్డి, అధ్యక్షురాలు అనురాధ, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధానకార్యదర్శి శ్యాంసుందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి పాల్గొన్నారు.

302
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles