సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ టాప్

Mon,November 11, 2019 01:54 AM

ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నదని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నా రు. నీటిపారుదల, ఐటీ, పారిశ్రామిక రంగాల్లోనూ గణనీయమైన ప్రగతి సాధిస్తున్నదని చెప్పారు. అంతర్జాతీయ వ్యాపారాలకు తెలంగాణలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం(టీడీఎఫ్) ప్రారంభించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన వేడుకలకు వినోద్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పౌల్ట్రీరంగం, షీప్‌ఫార్మ్ వ్యాపారానికి తెలంగాణలో అనుకూల వాతావరణం ఉన్నదని ఆయన చెప్పారు.


సమశీతోష్ణ వాతావరణం గల తెలంగాణ ప్రాంతం అన్నివ్యాపారాలకు అనువుగా ఉంటుందన్నారు. టీ-హబ్‌తోపాటు ఎన్నో ఇన్నోవేటివ్ కార్యక్రమాలు ఐటీ, ఫార్మా పరిశ్రమలు తెలంగాణలో ఆవిష్కృతమయ్యాయని వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో ఉన్నదన్నారు. వ్యవసాయరంగంలో, రియల్‌ఎస్టేట్ రంగంలో తెలంగాణలో అనేక అవకాశాలున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఎన్నారైలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ జెడ్పీచైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, ఎన్నారై డాక్టర్ దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

192
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles