క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ పురస్కారాలు

Thu,October 10, 2019 01:14 AM

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన క్రిస్టియన్‌ మైనార్టీ సామాజిక వర్గానికి చెందినవారికి 2019 సంవత్సరానికిగాను పురస్కారాలు అందజేయనున్నట్టు క్రిస్టియన్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీ కాంతివెస్లీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక సేవ, వైద్యం, విద్య, సాహిత్యం, ఫైన్‌ఆర్ట్స్‌, క్రీడలు వంటి రంగాల్లో కనీసం పదేండ్లు పనిచేసినవారు, ఆరోగ్య, విద్య, సామాజిక సేవా సంస్థల్లో కనీసం 30ఏండ్లు పనిచేసిన అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పురస్కారాలకు అరు ్హలని పేర్కొన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేస్తామని, ఈ నెల 10 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం www.tscmfc.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

177
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles