మార్చి 19 నుంచి పది పరీక్షలు

Wed,December 4, 2019 02:45 AM

-ఏప్రిల్ 6న ముగింపు
-ప్రధాన పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు
-సెకండ్ లాంగ్వేజీ పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు
-టైంటేబుల్ విడుదలచేసిన ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 19వ తేదీ నుంచి ఏప్రిల్ 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రధాన పరీక్షలు మార్చి 19 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు.. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల దాకా నిర్వహిస్తారు. ద్వితీయ భాష (సెకండ్ లాంగ్వేజీ)కు సంబంధించిన పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఉంటుంది. ఇందులోభాగంగా అన్ని సబ్జెక్టుల్లో ఆబ్జెక్టివ్ పేపర్ (పార్టు-బీ)ను చివరి అరగంటలో మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఈ మేరకు పదో తరగతి పరీక్షల టైంటేబుల్‌ను మంగళవారం విడుదలచేసిన ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ బీ సుధాకర్.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని చెప్పారు.
10th1

1067
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles