తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం

Mon,November 11, 2019 01:22 AM

-విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
తాండూరు, నమస్తే తెలంగాణ : తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రూ.13. 23 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఇతర రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారన్నారు. 30 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమం మంచి ఫలితాలిచ్చిందనీ, అదే స్ఫూర్తితో ప్రస్తుతం మున్సిపల్స్‌లో కూడాపట్టణ ప్రణాళికలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ పూర్తయిందని.. త్వరలో ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులను కూడా భర్తీ చేస్తామన్నారు.

74
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles