సౌదీలో బందీలుగా తెలంగాణవాసులు

Tue,March 21, 2017 01:42 AM

జోక్యం చేసుకొని విడిపించాలని కేంద్రమంత్రికి కేటీఆర్ లేఖ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సౌదీ అరేబియాకు చెందిన అల్‌హజ్రీ ఓవర్సీస్ కంపెనీ ఆధీనంలో బందీలుగా చిక్కుకున్న 29మంది తెలంగాణ కార్మికులను తక్షణమే విడిపించి వెనుకకు రప్పించేందుకు దౌత్యపరమైన చొరవ తీసుకోవాలని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర విదేశాంగ మంత్రి సుస్మాస్వరాజ్‌ను కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్రమంత్రికి లేఖ రాశారు. పన్నెండు రోజులుగా కార్మికులు అన్నపానీయాల్లేకుండా తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.
K_T_R

నేడు అబుదాబీకి అగ్నిప్రమాద మృతుల బంధువులు


2017 జనవరిలో అబుదాబీలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన తెలంగాణవాసుల మృతదేహాల గుర్తింపును పూర్తిచేసి ఇండియాకు తెప్పించేందుకు రాష్ట్ర ఎన్నారై వ్యవహారాలశాఖ మంత్రి కే తారకరామారావు ఏర్పాట్లుచేశారు. అగ్నిప్రమాదంలో నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. అందులో కామారెడ్డికి చెందిన పిట్ల నరేశ్ మృతదేహాన్ని గుర్తించి జనవరి 11న స్వస్థలానికి పంపించారు. మిగతా నలుగురిని గుర్తించడానికి మృతుల కుటుంబాలనుంచి నలుగురితోపాటు అదనంగా ఇద్దరికి అబుదాబీ వెళ్లేందుకు పాస్‌పోర్టులను సిద్ధంచేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. మంగళవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి వీరు అబుదాబీకి వెళ్తున్నారు.

423

More News

మరిన్ని వార్తలు...