నకిలీ విత్తనంపై కన్నెర్ర


Thu,May 23, 2019 02:01 AM

Telangana Police to crack down on fake seed dealers

-వ్యవసాయాధికారుల విస్తృత తనిఖీలు
-వేములవాడలో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
-గద్వాల, మేడ్చల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ పట్టివేత
-పెద్దపల్లి, రంగారెడ్డిల్లో బయో దందా బట్టబయలు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: నకిలీ విత్తనాలపై రాష్ట్ర సర్కార్ ఉక్కుపాదం మోపుతున్నది. తనిఖీలు, పరిశీలనలతో అక్రమ వ్యాపారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. నకిలీ విత్తనాలు విక్రయించే వారిని కటకటాల్లోకి పంపుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో నకిలీ పత్తి విత్తనాలను పట్టుకొని, ఇద్దరిని అరెస్టు చేయగా, పెద్దపల్లి జిల్లాల్లో అక్రమ బయో దందా గుట్టును వ్యవసాయశాఖ అధికారులు రట్టుచేశారు. గద్వాల, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

సిరిసిల్లలో ఇద్దరు నకిలీ పత్తి విత్తన డీలర్ల అరెస్టు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు నకిలీ పత్తి విత్తన డీలర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వేములవాడ మండలం తిప్పాపూర్‌లో ఫర్టిలైజర్ దుకాణంలో నుంచి 130 నకిలీ పత్తి వితనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హెగ్డే మీడియాకు వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా గాలిపాలెంకు చెందిన అట్ల శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌లో నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి, వేములవాడ ప్రాంతంలోని రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నాడు. శ్రీనివాసరెడ్డికి సహాయంగా వేములవాడ మండలం తిప్పాపూర్‌లోని కొమురవెల్లి శివుడు భాగస్వామిగా ఉన్నాడు. బుధవారం హైదరాబాద్ నుంచి 130 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను కొనుగోలు చేసి, వేములవాడ మండలం తిప్పాపూర్‌లోని రాజరాజేశ్వరి ఫర్టిలైజర్ దుకాణంలో ఇరువురు కలిశారు.

నకిలీ పత్తి విత్తనాలను చుట్టు పక్కల గ్రామాల్లోని రైతులకు సరఫరా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నకిలీ విత్తనాలు రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్టు విచారణలో అంగీకరించారని ఎస్పీ వెల్లడించారు. వీరిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ దందాలు, నకిలీ విత్తనాలు విక్రయాల సమాచారం అందించాలని, వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. సీసీఎస్ పోలీసులను ఆయన అభినందించారు.

రూ.లక్ష విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని బాబాసాగర్ గ్రామంలో బుధవారం రూ.1.17 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను ఎస్‌ఐ లచ్చన్న ఆధ్వర్యంలో పట్టుకున్నారు. పలు ఇండ్లలో సోదాలు నిర్వహించగా, కొండు వెంకన్న ఇంట్లో వీటిని పట్టుకున్నామని, వెంకన్నపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

fake-seeds4

బయో ఉత్పత్తుల తయారీ కంపెనీపై దాడి

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో నాసిరకం బయో ఉత్పత్తులను తయారుచేస్తున్న కంపెనీపై వ్యవసాయఅధికారులు దాడిచేశారు. హయత్‌నగర్ వీరభద్రనగర్ కాలనీలో ఎన్రిత్ అగ్రిసైన్స్ పేరుతో శ్రీకాంత్ అనే వ్యక్తి మూడేండ్లుగా బయోప్రొడక్ట్స్‌ను తయారు చేస్తూ రైతులకు సరఫరా చేస్తున్నాడు. పక్కా సమాచారంతో ఇబ్రహీంపట్నం వ్యవసాయఅధికారులు అగ్రిసైన్స్ కంపెనీపై దాడిచేశారు. కనీస ప్రమాణాలు పాటించకుండా బయో ప్రొడక్ట్స్‌ను తయారుచేస్తున్నట్టు గుర్తించారు. కంపెనీలో తయారు చేసిన పలు ఉత్పత్తుల శాంపిళ్లను పరీక్షల కోసం ల్యాబ్‌కు తరలించారు. అధికారుల ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌పై కేసు అరెస్ట్ చేశారు.

fake-seeds3

పెద్దపల్లిలో అక్రమ బయోదందా గట్టురట్టు

బయో ఎరువుల అక్రమ వ్యాపారం గుట్టురట్టయింది. వ్యవసాయశాఖ అధికారులు.. పక్కా సమాచారంతో బుధవారం పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ శివారులో మాటువేశారు. తనిఖీల్లో బయో ఎరువులను విక్రయించే వ్యాన్‌ను ఎరువులతో సహా పట్టుకున్నారు. కారకులైన జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం పొల్వాయికి చెందిన మల్లేశ్, కమాన్‌పూర్ మండలం గుండారానికి ఆంజనేయులుపై పోలీసులకు ఫిర్యా దు చేయగా.. వారు కేసు నమోదు చేశారు. తనిఖీల్లో నీమ్ కోటెడ్ ఆర్గానిక్ మాన్యూవర్, త్రీజీ గ్రా న్యూస్ పేరుతో 30 బస్తాలు, గ్రోత్ ఇండూసర్ పేరుతో ఉన్న 14 మందు బా టిళ్లు దొరికాయి. వీటిని హైదరాబాద్ నుంచి పెద్దపల్లి జిల్లాలో విక్రయించేందుకు తరలిస్తుండగా పట్టుకున్నట్టు ఏడీఏ కృష్ణారెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాల్లో వీటిని అమ్మినట్టు నిందితులు పేర్కొన్నారని చెప్పారు.

fake-seeds2

నకిలీ విక్రయిస్తే పీడీ యాక్టు

నకిలీ, నిషేధిత విత్తనాలను విక్రయించిన వ్యక్తులు, కంపెనీలపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని మేడ్చల్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి శోభారాణి హెచ్చరించారు. జిల్లాలో టాస్క్‌ఫోర్స్ దా డులు నిరంతరం కొనసాగుతాయని స్పష్టంచేశారు. జిల్లాలోని విత్తన కంపెనీల్లో, శీతల గిడ్డంగులలో ఈ నెల 20వ తేదీ నుంచి టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహిస్తున్నారని, తనిఖీలలో ప్రధానంగా మీజీ-3 పత్తి విత్తన (ైగ్లెఫోసెట్ కలుపు మందును తట్టుకునే రకం) నిల్వలపై దాడులు చేశారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోనక్ ఆగ్రో సైన్సెస్, గోల్డెన్ సీడ్స్ ఇంటర్నేషనల్ సీడ్స్ కంపెనీలపై కేసు నమోదు చేయడంతోపాటు సుమారు 300 క్వింటాళ్ల పత్తి విత్తనాలను సీజ్ చేశామని, రోనక్ ఆగ్రో సైన్సెస్‌పై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయనున్నట్టు పేర్కొన్నారు.

fake-seeds5

మల్దకల్‌లో 175 కేజీలు పట్టివేత

జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో మద్దెలబండల గ్రామంలో బుడ్డన్న అనే వ్యక్తి తన ఇంట్లో దాచి ఉంచిన 175 కేజీల నకిలీ పత్తి విత్తనాలను మంగళవారం రాత్రి వ్యవసాయాధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల ఫిర్యాదు మేరకు బుడ్డన్నను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles