తెలంగాణ పోలీస్ మరో రికార్డ్


Sun,December 16, 2018 01:19 AM

Telangana police are the number one in the country in the use of technology

-దేశంలో తొలిసారిగా వరంగల్‌లోఐసీజేఎస్ ప్రారంభం
-కోర్టులు, పోలీసుల మధ్య సమన్వయం
-ఐసీజేఎస్ విధానం ప్రారంభంలో జస్టిస్ మదన్ బీ లోకుర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టెక్నాలజీ వినియోగంలో దేశంలో నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ పోలీసులు మరో ముందడుగు వేశారు. దేశంలో తొలిసారిగా ఐసీజేఎస్ (ఇంటర్ ఆపెరబల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం) పైలట్ ప్రాజెక్టు కింద వరంగల్ జిల్లా సుబేదారి పోలీస్‌స్టేషన్ నుంచి శనివారం ప్రారంభించారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా.. ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు జస్టిస్, ఐసీజేఎస్ చైర్మన్ మదన్ బీ లోకుర్, ఉమ్మడి హైకోర్టు నుంచి ప్రధాన న్యాయమూర్తి టీఎన్ రాధాకృష్ణన్, ఢిల్లీ నుంచి హోంశాఖ ఉన్నతాధికారులు డీజీపీ కార్యాలయం నుంచి డీజీపీ మహేందర్‌రెడ్డి, అడిషనల్ డీజీలు రవిగుప్తా, గోవింద్‌సింగ్, వరంగల్ కమిషనరేట్ నుంచి కమిషనర్ రవీందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసీజేఎస్ చైర్మన్ మదన్ బీ లోకుర్ మాట్లాడుతూ.. సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులు ఎంతో ముందున్నారని.. అందుకే వరంగల్ జిల్లాలో ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించామని చెప్పారు. దీనిని క్రమంగా రాష్ట్రం మొత్తం విస్తారిస్తామని తెలిపారు. ఏదైనా ఒక కేసుకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు, కోర్టులు, జైళ్లు, ఫోరెన్సిక్ అధికారులతోపాటు ప్రాసిక్యూషన్ విభాగాలకు వెంటవెంటనే చేరవేసేందుకు ఐసీజేఎస్ విధానం తోడ్పడుతుందని వివరించారు. ఈ విధానంతో పోలీస్, జ్యుడీషియల్ అధికారుల మధ్య సమన్వయం పెరిగి.. కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని చెప్పారు.

3059
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles