తెలంగాణ అభివృద్ధికి బీజేపీ అడ్డుపుల్ల


Fri,July 12, 2019 02:41 AM

Telangana People Fires On BJP Govt

-మండిపడుతున్న తెలంగాణవాదులు రక్షణభూములపై నీచ రాజకీయం
-సచివాలయంతోపాటు రెండు ఎలివేటెడ్ ైఫ్లెఓవర్ల నిర్మాణాన్ని అడ్డుకున్న నేతలు
-మూడు జిల్లాల ప్రజలకు తప్పని ట్రాఫిక్ కష్టాలు
-భూములివ్వకుండా అడ్డుకున్నామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాటలతో నిజస్వరూపం బయటకు
-మండిపడుతున్న తెలంగాణవాదులు

రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతున్న తీరు చూసి ఓర్వలేని కుట్ర. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా నూతన భవనాలు, రహదారులు నిర్మించుకుంటామంటే స్థలాలు కేటాయించేందుకు రాని మనసు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులుగా సొంత రాష్ర్టానికి మరిన్ని నిధులు, ప్రయోజనాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన బీజేపీ నాయకులు.. దానికి బదులు.. రాష్ట్ర అభివృద్ధిని వీలైనంత మేరకు అడ్డుకునేందుకు తహతహలాడుతుండటమే ఇక్కడ విషాదం. గడిచిన ఐదేండ్లలో రాష్ర్టానికి కేంద్రం అడగకుండా ఇచ్చిందేమీలేకపోగా.. చేసిన విజ్ఞప్తులను సైతం బుట్టదాఖలుచేస్తూ వచ్చింది. ఇందులో ఒక్క కేంద్రం పాత్రేకాదు.. స్వయంగా రాష్ట్ర బీజేపీ నాయకుల కుతంత్రాలు కూడా ఉన్నాయనేది వారి మాటల్లోనే ఇప్పుడు తేటతెల్లమైంది. వీరి నిర్వాకంతో సచివాలయంతోపాటు ప్రజాశ్రేయస్సు కోసం నిర్మించతలపెట్టిన రెండు ఎలివేటెడ్ ైఫ్లెఓవర్లు సైతం ముందుకు కదలని పరిస్థితి దాపురించింది. రహదారుల విస్తరణకు కంటోన్మెంట్ భూములు ఇవ్వకుండా కేంద్రాన్ని తామే ఆపామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్షణ్ చేసినవ్యాఖ్యలపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
Laxminarayana
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సికింద్రాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన సచివాలయ నిర్మాణానికి కంటోన్మెంట్ భూములను ఇవ్వకుండా కేంద్రం ద్వారా తామే ఆపించామని మూడ్రోజులక్రితం ప్రతిపక్ష పార్టీలు నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్షణ్ చేసిన ప్రకటనపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు. స్వరాష్ట్రంపై బీజేపీ నాయకులు కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చిన నాటినుంచి నేటివరకు తెలంగాణకు చేసింది ఏమీలేదని గుర్తుచేస్తున్నారు. అనుమతుల మంజూరు, అభివృద్ధి పథకాల అమలులో వివక్ష పాటించడమేకాకుండా.. బడ్జెట్ కేటాయింపుల్లో సైతం రాష్ట్రం పట్ల వ్యతిరేకతను చాటుకుంటున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణలో ప్రజాబలం లేకున్నా రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్షంగా పెత్తనం చలాయించే కుట్రలకు బీజేపీ పాల్పడుతున్నదని ఆరోపిస్తున్నారు.

ఉత్తర తెలంగాణకు నష్టం

పెరుగుతున్న రాష్ట్ర పాలనా అవసరాల నేపథ్యంలో బైసన్‌పోలో గ్రౌండ్‌లో నూతన సచివాలయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దానితోపాటే ఉత్తర తెలంగాణకు వెళ్లే రహదారి విస్తరణకు రక్షణశాఖ భూములు ఇవ్వాలని ఐదేండ్లుగా విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నది. నిజానికి దశాబ్దకాలంగా సికింద్రాబాద్‌లోని జేబీఎస్ బస్టాండ్ నుంచి తిరుమలగిరి, అల్వాల్ మీదుగా కరీంనగర్ వెళ్లే ప్రధాన మార్గం రోజురోజుకూ కుంచించుకుపోతున్నది. జేబీఎస్ నుంచి తాడ్‌బండ్, బోయిన్‌పల్లి మీదు గా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లే మార్గం కూడా ఇదే స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ఈ రోడ్లపై ప్రయాణమంటే నరకప్రాయమేనని ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ ప్రాంతవాసులు గోసపెడుతున్నారు.
Traffic1
కంటోన్మెంట్ ప్రాంతమంతా సికింద్రాబాద్ నడిబొడ్డున ఉండటం మూలం గా ప్రస్తుతం కనీసం రోడ్డు విస్తరణకు నోచుకోవడం లేదు. పైగా రద్దీ సమయాల్లో ఆర్మీ నిబంధనల మేరకు ప్రధాన రహదారుల మూసివేత కూడా తీవ్రమైన ట్రాఫిక్ రద్దీతో లక్షలమందికి ఇబ్బందులను తెచ్చిపెడుతున్నది. ప్రజాశ్రేయస్సు, ట్రాఫిక్ సమస్య అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం బైసన్‌పోలో మైదానంలో సచివాలయంతోపాటు రెండు ఎలివేటెడ్ ైఫ్లెఓవర్లు నిర్మించాలని ఆలోచనను చేసింది. తద్వారా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు హైదరాబాద్ రాకపోకలకు ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని భావించింది. కానీ, రాష్ట్ర బీజేపీ నాయకులు అడ్డుతగలడంతో రక్షణశాఖ భూముల కేటాయింపు విషయంలో సందిగ్ధత నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోననే దురుద్దేశంతో అభివృద్ధి పనులకు బీజేపీ అడ్డుపడింది. కేంద్రం నిర్ణ యం వెనుక అసలు శక్తులు బీజేపీ నేతలేనని తాజాగా వెల్లడైంది. దూరదృష్టి, ప్రజల కష్టాలపై అవగాహనలేని ఇరుకు మనస్తత్వం ఉన్నవారి వైఖరి కారణంగా ప్రజలు ఇంకా ఎన్నేండ్లు అవస్థలు పడాలో!

ఇవ్వకుండా ఆపామనడం ఘోరం

KMR-Gopal
స్వరాష్ట్ర అభివృద్ధికి బాధ్యతాయుతంగా పనిచేయాల్సినవారే కేంద్రంతో మాట్లాడి భూములు ఇవ్వకుండా ఆపినట్టు ప్రకటించుకోవడం ఘోరమైన విషయం. రక్షణభూముల అప్పగింత వెనుకకు వెళ్లడం ఉత్తర తెలంగాణప్రాంతవాసులకు ఎనలేని నష్టమే.

కేంద్ర ప్రభుత్వ వ్యవహారం సరికాదు..

KMR-Boddin
కేసీఆర్ ప్రభు త్వం మంచి పనిచేస్తుంటే కేం ద్రానికి నిద్రపట్టడంలేదు. రాజకీయ దురుద్దేశం తో రాష్ట్ర అభివృద్ధికి అడ్డు తగులుతున్నది. మొన్నటికిమొన్న కేంద్ర బడ్జెట్‌లో మొండిచేయి చూపించింది. పైగా రక్షణభూముల అప్పగింత వ్యవహారంలో కేంద్రం వైఖరి సరిగాలేదు.

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ

KMR-Anji
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మ ధ్య సత్సంబంధాలు పెంచి పోషించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో తెలంగాణ ప్రయత్నాలు చేస్తుంటే కేంద్రం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. సమాఖ్య విధానానికి తూట్లుపొడుస్తున్న తీరు హేయమైంది.

రక్షణ భూములు బదలాయించాలి

KMR-Gopi
రక్షణ భూముల అప్పగింతతో ప్రభుత్వానికన్నా లక్షలమంది ప్రజలకు లబ్ధిచేకూరుతుంది. దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపడంకోసం కేసీఆర్ ప్రయత్నిస్తుంటే ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న భయంతో బీజేపీ నాయకులు నీచమైన కుట్రలకు దిగుతున్నారు. రక్షణ భూములను ఇవ్వకుండా తామే అడ్డుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే చెప్పటం వారి చిల్లర రాజకీయాలను స్పష్టంచేస్తున్నది.

3729
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles