ఈ గవర్నెన్స్‌లో తెలంగాణ స్ఫూర్తిదాయకం


Tue,April 16, 2019 01:22 AM

Telangana inspiration in e governance

ఐఐటీ చెన్నై వర్క్‌షాప్‌లో ప్రొఫెసర్లు, విద్యార్థుల ప్రశంస
హైదరాబాద్, నమస్తే తెలంగాణ : ఎలక్ట్రానిక్ ఆధారిత పౌరసేవలు అందించటంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు స్ఫూర్తిదాయకమని ఐఐటీ చెన్నై ప్రొఫెసర్లు, విద్యార్థులు ప్రశంసించారు. మేనేజ్‌మెంట్ ఇన్విటేషన్స్ లెక్చర్స్ సిరీస్ (ఎంఐఎల్‌ఎస్) పేరుతో ఐఐటీ చెన్నైలో నిర్వహించిన సదస్సుకు తెలంగాణ రాష్ట్ర మీసేవ కమిషనర్ జీటీ వెంకటేశ్వర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై.. రాష్ట్రంలో అందిస్తున్న పౌరసేవలు, ఇందుకోసం ఉపయోగిస్తున్న బిగ్ డేటా, క్లౌడ్ టెక్నాలజీ, బ్లాక్ చెయిన్ తదితర అంశాలపై వివరించారు. ఎమర్జింగ్ టెక్నాలజీల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పౌరసేవలను ఉత్తమంగా అందిస్తున్నదని తెలిపారు. ఇప్పటికే ఆరు రాష్ర్టాలు తెలంగాణ విధానాలను అధ్యయనం చేశాయని వెల్లడించారు. మరిన్ని సేవలను ఆన్‌లైన్ ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఎంఐఎల్‌ఎస్ సదస్సుకు వ్యాపార రంగానికి చెందిన సీనియర్లను ఆహ్వానించడం ఆనవాయితీ. ఈ దఫా పారిశ్రామకవేత్తలకు కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి ఐఐటీ చెన్నై ఆహ్వానం అందించటం విశేషం.

86
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles