మున్సిపోల్స్‌కు ఏర్పాట్లు


Thu,June 20, 2019 02:51 AM

Telangana government seeks 151 days to finish  pre election works for urban local bodies

-రెండు విడుతల్లో పూర్తిచేసే చాన్స్?
-కొత్తగా కొలువుదీరనున్న 68 మున్సిపాలిటీలు
-గ్రేటర్ హైదరాబాద్, వరంగల్‌పై కొంత సందిగ్ధం
-2011 జనాభా లెక్కల ప్రకారం బీసీ గణన

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు అడుగులు పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్లకు మినహా మిగిలిన మున్సిపాలిటీల పదవీకాలం వచ్చేనెల 3తో ముగుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్‌కు ఏడాదిన్నర పదవీకాలం మిగిలి ఉండగా వరంగల్ కార్పొరేషన్‌కు రెండేండ్ల పదవీకాలం మిగిలి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టం తీసుకువస్తున్న నేపథ్యంలో ఈ రెండింటికి కూడా కలిపి ఎన్నికలు నిర్వహించాలా లేదా అన్నది నిర్ణయించాల్సి ఉన్నది. కొత్త చట్టం అమలులోకి వస్తే అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నదని ఎన్నికల సంఘం అధికారులు అంటున్నారు.

కొత్తగా కొలువుదీరనున్న 68 మున్సిపాలిటీలు

రాష్ట్రవ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్‌తో కలిపి 73 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో 69 మున్సిపాలిటీల పదవీకాలం జూ లైతో ముగుస్తున్నది. మరోవైపు కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 68 మున్సిపాలిటీ లు కూడా ఏర్పాటయ్యాయి. హైదరాబాద్ ప లు శివారు గ్రామాలను మున్సిపాలిటీల్లో కలిపారు. పలు నగర పంచాయతీల స్థానంలో మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. మొత్తంమీద రాష్ట్రంలో 151 మున్సిపాలిటీలు, కార్పొరేష న్లు ఉన్నాయి. త్వరలో జరుగనున్న ఎన్నికల తో 68 నూతన మున్సిపాలిటీల్లో మొదటిసారి పాలకమండళ్లు కొలువుదీరనున్నాయి.

కొత్తచట్టంతో అన్నింటికీ ఎన్నికలు

నూతన మున్సిపల్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్నది. దీనిప్రకారం కొత్త పంచాయతీరాజ్‌చట్టంతోపాటు.. సుప్రీంకోర్టు తీ ర్పును అనుసరిస్తూ రిజర్వేషన్ల పరిమితిని నిర్ణయించడం, రెండు పర్యాయాలు రిజర్వేషన్లు కొనసాగించేవిధంగా మార్పులు తీసుకువస్తున్నట్టు స్పష్టమైంది. ఇందుకోసం ఆర్డినెన్స్ జారీచేసే యోచనలో ప్రభుత్వం ఉన్నది. కొత్తచట్టం నేపథ్యంలో మహిళలకు సగం రిజర్వేషన్లు, చైర్మన్ల రిజర్వేషన్లను పొందుపర్చనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్ని ంటా కొత్తచట్టం అమల్లోకి వస్తుంది. ఈ ము న్సిపాలిటీలకు ఎన్నికయ్యే పాలకవర్గాలు కూ డా కొత్త పాలకవర్గాలుగానే రికార్డుల్లో ఉం టాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్‌కు ఏడాదిన్నరకు పైగా, గ్రేటర్ వరంగల్ పాలకవర్గాలకు ఇంకా రెండేండ్ల పదవీకాలం ఉంది. ఈ రెం డింటితో పాటు పాలకవర్గాల పదవీకాలం ము గియని వాటిని కొనసాగించాలా.. లేక కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తూ అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలా అన్న అంశాలపై ఇంకా తేల్చాల్సి ఉంది. కొత్తచట్టం అమల్లోకివస్తే అన్నింటికీ ఎన్నికలు వస్తాయని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు.

అందుబాటులో బీసీ లెక్కలు

వాస్తవంగా అర్బన్ ప్రాంతాల్లో బీసీ గణనను పరిషత్ ఎన్నికలకు ముందే పూర్తిచేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా బీసీ లెక్కలు నిర్ధారించారు. ఈ జాబితా కూడా ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉన్నది. వార్డుల విభజన పూర్తిచేస్తే... వార్డులు, చైర్మన్లవారీగా రిజర్వేషన్లు ఖరారవుతాయి. మరోవైపు కొత్త మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారులపాలన ఇంకా కొనసాగుతున్నది. జూలై తర్వాత పదవీకాలం ముగిసే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కూడా ప్రత్యేకాధికారులను నియమించేందుకు ఏర్పాట్లుచేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. మున్సిపాలిటీలకు ఆర్డీవో, సబ్ కలెక్టర్లను, కార్పొరేషన్లలో ఐఏఎస్‌లకు బాధ్యతలను అప్పగించనున్నారు.

రెండు విడుతల్లో పోలింగ్

అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే వాటిని రెండు విడుతల్లో పూర్తిచేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నది. వాస్తవానికి గతేడాది జూలై నుంచే ము న్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లుచేస్తున్నామని రాష్ట్ర ఎన్నికలసంఘం కమిషనర్ నాగిరెడ్డి ఇటీవల ప్రకటించారు. ప్రభుత్వం రిజర్వేషన్ల జాబితా ఇస్తే ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల అంశంపై మంత్రిమండలి చర్చించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం క్యాబినెట్ భేటీ అనంతరం తెలిపారు. జూలై వరకు మున్సిపాలిటీలకు పదవీకాలం ఉన్నదని, ఆ తర్వాత రెండు, మూడునెలల వరకు ఎన్నికలు నిర్వహించుకొనేందుకు సమయం ఉంటుందని చెప్పారు.

ఈ నేపథ్యంలో జూలైలో పదవీకాలం ముగిసిన తరవాత వార్డుల విభజన, రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ జారీచేస్తూ రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారుచేయనున్నట్లు తెలుస్తున్నది. దాదాపు ఆగస్టులో ఈ ప్రక్రియను పూర్తిచేసే అవకాశాలున్నాయి. వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లకు కొంత సమయం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు ఐదునెలల గడువు కావాలని హైకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలుచేసింది. చైర్మన్ల పదవులతోపాటు మున్సిపాలిటీల్లో వార్డుల విభజన, రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉండటంతో సమయం తీసుకుంటామని వెల్లడించింది. నూతన మున్సిపాలిటీలు సహా అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం గడువు కోరింది.

3069
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles