మార్కెట్లోకి బ్రాండ్ తెలంగాణ

Mon,November 11, 2019 02:54 AM

-త్వరలో విదేశాలకు మన పిండివంటలు, పచ్చళ్లు
-ఆహార శుద్ధికేంద్రాలతో ఆదాయం
-సీజన్లవారీగా ప్రయోగాలు విజయవంతం
-సీతాఫలం, పిండివంటలతో ముందుకు మరో అడుగు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచనలకు అనుగుణంగా రూపొందుతున్న ఆహార శుద్ధికేంద్రాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా చేపట్టిన ప్రయోగాలు విజయవంతమవుతున్నాయి. గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధి సాధించడం, రైతులు పండించిన పంటలను ఆన్‌డిమాండ్‌గా అమ్ముడుకావడం, గిట్టుబాటుధర కల్పించడం, నాణ్యమైన ఆహార పదార్థాలను అందించే లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. దీనిలోభాగంగా సీజన్లవారీగా ఆహార శుద్ధికేంద్రాల ఏర్పాటును ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఇప్పటికే మామిడి కొనుగోళ్లు విజయవంతం చేసిన మహిళా సంఘా లు.. ప్రస్తుతం సీతాఫలం, తెలంగాణ పిండివంటల పేరిట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నిర్వహిస్తున్నారు. త్వరలో బ్రాండ్ తెలంగాణ పేరిట పచ్చళ్లు, పిండివంటకాలను విదేశాలకు ఎగుమతిచేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు.

నా రాయణపేట జిల్లాలో ప్రస్తుత సీజన్‌ను అనుసరిస్తూ సీతాఫలం గుజ్జును తీసి ప్రముఖ ఐస్‌క్రీం కంపెనీకి విక్రయించేందుకు ఒప్పం దం చేసుకొన్నారు. నారాయణపేట జిల్లాలోని పలు మండలాల్లో సీతాఫలాలు విరివిగా లభిస్తుండగా వాటిని అమ్ముకునే సౌకర్యం లేకపోవడంతో... రైతులకు సరైన గిట్టుబాటుధర దొరుకడంలేదు. దాంతో సెర్ప్ ఆధ్వర్యంలో స్థానిక మహిళాసంఘాలతో ఆహార శుద్ధికేంద్రాలను ఏర్పాటుచేశారు. రైతులు సేకరించే సీతాఫలాలను శాస్త్రీయంగా గ్రేడింగ్‌చేసి గింజలు వేరుచేసి, గుజ్జును ఐస్‌క్రీం కంపెనీకి విక్రయిస్తున్నారు. గింజలను హరితహారం కేంద్రాల్లో మొక్కల పెంపకం, కంపోస్ట్ ఎరువుగా వినియోగించేలా చర్యలు తీసుకొంటున్నారు. దీనిద్వారా ఒక్కో మహిళ రూ.300 వరకు సంపాదిస్తున్నారు. సీతాఫలాలు సేకరించే రైతులకు కూడా గిట్టుబాటుధర వస్తున్నది. ఇప్పటికే లక్షల రూపాయల వ్యాపారం చేశారు. దా దాపు 100 మంది ఉపాధి పొందుతున్నారు.

నిజామాబాద్‌లో పిండివంటలు

ప్రజలకు నాణ్యమైన ఆహారపదార్ధాలను అందించడమే కాకుండా మహిళల్లో పెరుగుతున్న హిమోగ్లోబిన్ సమస్య నివారణకు ఉపయోగపడే సంప్రదాయ పిండివంటల తయారీని చేపట్టారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని బీడీలు చుట్టే మహిళల్లో నరాల సంబంధ వ్యా ధులు, కంటిశుక్లాల సమస్య, నడుంనొప్పి, కీళ్ల వ్యాధులు, శ్వాస ఇబ్బందులు వస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. బీడీ తయారీకి ప్రత్యామ్నాయంగా ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకొన్నారు. ఇక్కడ తయారుచేసే సకినాలు, అప్పాలు, సర్వపిండి వంటి తెలంగాణ సంప్రదాయ వంటకాలకు ఆదరణ పెరుగడం, ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్లు వస్తుండటంతో ఆహార శుద్ధిపరిశ్రమను కొనసాగించాలని నిరయించారు. కమ్మర్‌పల్లి మండల సమాఖ్యకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ ఇప్పించేందుకు సెర్ప్ అధికారులు దరఖాస్తు చేశారు. లైసెన్స్ వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని సూపర్ మార్కెట్లతోపాటు విదేశాలకు కూడా సరఫరా చేయాలని భావిస్తున్నారు.

బ్రాండ్ తెలంగాణ ఇమేజ్

రాష్ట్రం నుంచి ఎగుమతిచేసే ఆహార ఉత్పత్తులకు బ్రాండ్ తెలంగాణ ఇమేజ్ కల్పిస్తున్నారు. పిండివంటలతోపాటు పచ్చళ్లు, బత్తాయి ర సం, శీతలపానీయాలు, పండ్ల గుజ్జు, విత్తనాలను బ్రాండ్ తెలంగాణ పేరిట విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేయడం, మార్కెటింగ్ చేయడం, బ్రాండ్ తెలంగాణ పేరుతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో విక్రయించే ఏర్పాట్లను గ్రామీణాభివృద్ధిశాఖ పరిశీలిస్తున్నది. టమాట సాస్, మిర్చిపొడి, బేబీకార్న్, స్వీట్‌కార్న్, అల్లం, సీతాఫలాల యూనిట్లు ఏర్పాటుచేసి వాటికి కొంతమేర ఆర్థికసాయం అందించడం, మా ర్కెటింగ్ కోసం దేశ, విదేశీ మార్కెటింగ్ కంపెనీలతో ఒప్పందం చేసుకొని బ్రాండ్ తెలంగాణ ఉత్పత్తులను విక్రయించేందుకు కార్యాచరణ సిద్ధంచేశారు. ముందుగా తెలంగాణ పిండివంటలతోపాటు ఉసిరి, చికెన్, చేప, మాంసం పచ్చళ్లను ఎగుమతిచేయాలని భావిస్తున్నారు. రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలను నివారించడంలో ఉపయోగపడే నువ్వుల గజ్జలు, బెల్లం అరిశెలు, నువ్వుల సకినాలు, చెగోడీలు, అప్పడాలు కూడా మార్కెటింగ్ చేస్తున్నారు.

సెర్ప్ ద్వారా లైసెన్స్‌కు దరఖాస్తు

మహిళా సమాఖ్య ద్వారా తయారుచేస్తున్న ఈ పిండివంటలకు సెర్ప్ ద్వారా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, భారత ఆహార నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణ సంస్థ లైసెన్స్‌కు దరఖాస్తు చేసినట్టు ఐకేపీ సెర్ప్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కుంట గంగాధర్‌రెడ్డి తెలిపారు. కమ్మర్‌పల్లిలో ప్రయోగాత్మకంగా పిండివంటల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమాఖ్య ద్వారా తయారయ్యే పిండివంటలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యపరంగా లాభదాయకమని చెప్పారు.

2699
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles