సెప్టెంబర్ 1 నుంచి ఆర్థికసర్వే


Wed,August 14, 2019 01:23 AM

Telangana economic census to begin on September 1

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆర్థికసర్వే నిర్వహించనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 వేలమంది ఎన్యూమరేటర్లు ఈ సర్వేలో పాల్గొంటారు. వీరు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ఆ కుటుంబసభ్యులు ఏ పనిచేస్తున్నారు? వారికి ఎంత ఆదాయం వస్తున్నది? ఉద్యోగం చేస్తున్నారా? స్వయం ఉపాధి పొందుతున్నారా? స్వయం ఉపాధి పొందడంతోపాటు ఇంకెవరికైనా ఉపాధి కల్పిస్తున్నారా? అనే వివరాలను సేకరిస్తారు. దీంతోపాటు గ్రామపంచాయతీలు, మున్సిపాల్టీలు కార్పొరేషన్లలో ఎంతమంది వ్యాపారాలు చేస్తున్నారు? ఎన్ని పరిశ్రమలున్నాయి? వాటిలో రిజిస్టరయినవి ఎన్ని? ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు? ఆ పరిశ్రమల టర్నోవర్ ఎంత? ఆదాయం ఎంత? అనే వివరాలు తెలుసుకుంటారు.

ఇలా రెండు విధాలుగా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ఏడో ఆర్థికసర్వే నిర్వహిస్తారు. కేంద్ర గణాంకాల కార్యాలయం (ఎన్నెస్వో) ఆధ్వర్యంలో జరిగే ఈ సర్వేను మూడునెలల్లో పూర్తిచేసి ఫిబ్రవరిలో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. ఈ సర్వేలో పాల్గొనే ప్రాంతీయస్థాయి అధికారులకు మంగళవారం ఎంసీహెచ్చార్డీలో శిక్షణ ఇచ్చారు. ఎంసీహెచ్చార్డీలో శిక్షణ పొందిన ప్రాంతీయస్థాయి అధికారులు క్షేత్రస్థాయి సర్వే సిబ్బందికి అవగాహన కల్పించాలని ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఎన్నెస్వో తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ డీ సతీశ్, పలువురు అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

873
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles