తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తంచేస్తాం


Wed,June 12, 2019 02:08 AM

Telangana culture is universalized

-అటా నూతన అధ్యక్షుడు వినోద్‌కుమార్
ఖైరతాబాద్: తెలంగాణ సంస్కృతి, సం ప్రదాయాలను పరిరక్షించి విశ్వవ్యాప్తం చేసేందుకు కృషిచేస్తానని అమెరికన్ తెలంగాణ అసోషియేషన్ (అటా) నూతన అధ్యక్షుడు వినోద్‌కుమార్ కుకునూర్ తెలిపా రు. అటా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడారు. సంగీత సాహిత్య కళారంగాల్లో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, ప్రోత్సాహక ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు పలుకుతూ అమెరికాలో అంతర్జాతీయ వేడుకల్లో ఇక్కడి కళాకారులు, సాహితీవేత్తలకు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో మహిళా సాధికారతకు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తనవంతు కృషిచేస్తానని తెలిపారు. సమావేశంలో అటా కోశాధికారి రామచంద్రారెడ్డి ఆది, భారత సమన్వయకర్తలు డాక్టర్ పద్మజారెడ్డి, రామచంద్రారెడ్డి బాణాపురం తదితరులు పాల్గొన్నారు.

176
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles