కోమటిరెడ్డికి కాంగ్రెస్ షోకాజ్ నోటీసు


Thu,June 20, 2019 02:25 AM

Telangana Congress issues show cause notice to Rajgopal Reddy

-నేడు అనుచరులతో రాజగోపాల్‌రెడ్డి భేటీ..
-బీజేపీలో చేరికపై నిర్ణయం!

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పార్టీ నాయకత్వం బుధవారం షోకాజ్ నోటీస్ జారీచేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, పీసీసీ అధ్యక్షుడిని, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిని కించపరుస్తూ మాట్లాడిన నేపథ్యంలో ఆయనకు షోకాజ్ నోటీస్ జారీచేసినట్టు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం తెలిపింది. పదిరోజుల్లోగా నోటీసుకు సమాధానం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి గురువారం తన అనుచరులతో భేటీ కానున్నారు. హైదరాబాద్ నగరశివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో సమావేశం అవుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని, కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం ఉందని ఆయన పేర్కొన్నారు. బీజేపీలో చేరే విషయంపై అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని రాజగోపాల్‌రెడ్డి ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుత భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

1756
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles