పరిశ్రమల అవసరాలు గుర్తించండి

Tue,January 22, 2019 02:10 AM

-27 నాటికి లొకేషన్లవారీగా మ్యాపులు అందించాలి
-మిషన్‌భగీరథ సమీక్షలో సీఎస్ ఎస్కే జోషి ఆదేశాలు

హైదరాబాద్, నమస్తేతెలంగాణ: రాష్ట్రంలోని 59 పారిశ్రామిక క్లస్టర్లకు అవసరమైన నీటి వివరాలను గుర్తిం చి, లొకేషన్లవారీగా మ్యాపులతో ఈ నెల 27 నాటికి సమర్పించాలని సీఎస్ ఎస్కే జోషి ఆదేశించారు. సోమవారం ఆయన మిషన్ భగీరథపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. టీఎస్‌ఐఐసీ ద్వారా ఫార్మాసిటీ, నిమ్జ్, టెక్స్‌టైల్ పార్కు, మెడికల్ డివైజె స్ పార్కు, ఎంఎస్‌ఎంఈ, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్, చందన్ వాలీ ఇండస్ట్రీపార్కు వంటి పారిశ్రామిక క్లస్టర్లకు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్వల్పకాలిక, మధ్యకాలిక, ధీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాలని, వివరాలను సమర్పించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా క్లస్టర్లకు నీటిని బల్క్‌గా సరఫరా చేయాలని, ఇంటర్నల్ పైప్‌లైన్ వంటి ఏర్పాట్లను టీఎస్‌ఐఐసీ చేసుకోవాలని సూచించారు. వచ్చే 20, 25 ఏండ్లను దృష్టిలో ఉం చుకొని డిమాండ్‌ను అంచనా వేయాలన్నారు.

మిష న్ భగీరథ ద్వారా 12,755 గ్రామాలు, 118 పట్టణ స్థానిక సంస్థల్లో 23,968 హ్యాబిటేషన్స్‌కు మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఔటర్ బయటి గ్రామాలకు మిషన్ భగీరథ, లోపలి గ్రామాలకు జలమండలి ద్వారా నీరు అందించాలన్నారు. ఔటర్ పరిధిలోని గ్రామాలు, హౌసింగ్‌కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, పట్టణ స్థానిక సంస్థల్లో అన్ని ఇండ్లకు నీరు అందించడానికి జలమండలి పనులు వేగవం తం చేయాలన్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏతో సమన్వయం చేసుకొని గుర్తింపు పొందిన లేఅవుట్లకు నీటిసరఫరా జరుగాలన్నారు. సమీక్షలో సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకటనర్సింహారెడ్డి, ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్‌రావు, మిషన్‌భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, జలమండలి డైరెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.

580
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles