నేడు రాష్ట్ర క్యాబినెట్ భేటీ


Wed,July 17, 2019 01:58 AM

Telangana Cabinet Meeting Today

-కొత్త మున్సిపల్ చట్టం బిల్లును ఆమోదించనున్న మంత్రివర్గం
-వివిధ ఆర్డినెన్సులను కూడా ఆమోదించే అవకాశం
-రేపు, ఎల్లుండి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పురపాలకశాఖ నూతన బిల్లుకు ఆమోదం పొంది చట్టంగా తీసుకురావడమే ప్రధాన ఎజెండాగా రాష్ట్ర మంత్రివర్గం బుధవారం సమావేశంకానుంది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన భేటీకానున్న మంత్రివర్గం.. మున్సిపల్ బిల్లుతోపాటు గతంలో జారీచేసిన పలు ఆర్డినెన్స్‌లకు ఆమోదం తెలిపి, చట్టరూపం ఇచ్చే అవకాశం ఉన్నది. నూతన పురపాలక చట్టం తీసుకొచ్చేందుకు గురు, శుక్రవారాల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు పురపాలకశాఖ సిద్ధంచేసిన ముసాయిదా బిల్లుకు న్యాయశాఖ ఆమోదం కూడా లభించింది. ఈ నేపథ్యంలో బుధవారం సమావేశంకానున్న మంత్రివర్గం బిల్లుపై చర్చించి ఆమోదం తెలియజేయనున్నది. కొత్త చట్టం ఉద్దేశం, దాని లక్ష్యాలు, తన మనసులోని ఆలోచనలను ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులకు వివరిస్తారు. క్యాబినెట్‌లో ఆమోదించిన బిల్లును ఈ నెల 18న అసెంబ్లీలో ప్రవేశపెడతారు. 19న ఆమోదం పొందనున్నారు. అదేరోజు కౌన్సిల్‌లోనూ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందనున్నారు.

239
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles