విదేశాల్లో బోనాల సంబురాలు


Fri,July 12, 2019 02:00 AM

Telangana Association of UK celebrates Bonalu in London

టాక్ ఆధ్వర్యంలో లండన్‌లో నిర్వహణ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్రశర్మ, సీమ మల్హోత్రా, రూత్‌కాడ్బరి, ఇండియన్ హై కమిషన్ ప్రతినిధి ప్రేమ్‌జిత్, హౌన్సలా డిప్యూ టీ మేయర్ రాగ్విందర్‌సిద్దు ముఖ్యఅతిథులుగా హాజరైనట్టు టాక్ కార్యదర్శి రత్నాకర్ కడుదుల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపుతోపాటు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. పోతురాజు వేషధారణలో జయ్‌రెడ్డి ఆకట్టుకున్నారని తెలిపారు.

టాక్ సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్రరెడ్డి కంది మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నివిధాల తమకు అండగా ఉంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో అడ్వైజరీ చైర్మన్ గోపాల్ మేకల, ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, అడ్వైజరీ వైస్ చైర్మన్ మట్టారెడ్డి, సభ్యులు నవీన్‌రెడ్డి, రత్నాకర్, శ్రీధర్‌రావు, శ్రీకాంత్ జెల్ల, సత్య పిం గళి, సత్య చిలుముల, సత్యం కంది పాల్గొన్నారు.

న్యూజిలాండ్‌లో బోనాల జాతర

న్యూజిలాండ్‌లోని అక్లాండ్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుకలు నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు కటకం దయానంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ప్రతినిధులు, తెలంగాణ వాసులు సుమారు 300 మంది పాల్గొన్నారు.

410
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles