విత్తన భాండాగారంగా తెలంగాణ

Mon,November 11, 2019 01:22 AM

-మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం వ్యవసాయం: తెలంగాణ రాష్ట్రం విత్తన భాండాగారంగా మారుతున్నదని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నా రు. ఆదివారం సాయంత్రం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో కాటన్ కార్పొరేషన్ సంస్థ (సీసీఐ) కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రైతు సలహా కేంద్రాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చొరవ తో నేడు రాష్టం సాగులో సరికొత్త ఒరవడి సృష్టిస్తున్నదన్నారు. ఓవైపు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మరోవైపు నిరంతర విద్యుత్ తో రైతులకు ఎంతో మేలు చేకూరిందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి క్వింటాల్‌కు రూ. 5.550 ధర ఉన్నదని.. రైతులు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

79
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles