టీచర్ పోస్టుల ఫలితాలపై హర్షం

Sun,October 13, 2019 01:28 AM

-సీఎం కేసీఆర్‌కు సెలెక్టెడ్ టీచర్ల సంఘం కృతజ్ఞతలు
ముషీరాబాద్: ఎస్జీటీ ఫలితాలు ప్రకటించడం పట్ల సెలెక్టెడ్ టీచర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. శనివారం విద్యానగర్ (హైదరాబాద్)లో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దసరా సెలవుల్లో ఫలితాలు ప్రకటించారని చెప్పారు. ఇంగ్లిష్ మీడియం టీచర్‌పోస్టులు, హిందీ పండిట్ పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, వికలాంగుల కోటా పోస్టులకు సంబంధించిన ఫలితాలు కూడా విడుదల చేయాలని కోరారు. ఎంపికైన అభ్యర్థులు బాధ్యతాయుతంగా ఉద్యోగం చేయాలని.. పాఠశాలలో విద్యాప్రమాణాలు పెంచాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు నీల వెంకటేశ్, పగిళ్ల సతీశ్, చంద్రశేఖర్, నరేశ్‌గౌడ్, గజేందర్, మహేందర్‌గౌడ్, భాస్కర్, ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.

119
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles