లెక్చరర్లకు టాస్క్ ప్రత్యేక శిక్షణ


Wed,November 30, 2016 01:03 AM

Task specific training to lecturers

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) మరో కీలక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే తమ సిబ్బంది ద్వారా ఆయా కాలేజీల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న టాస్క్ ప్రస్తుతం లెక్చరర్లకు ప్రత్యేక శిక్షణను ప్రారంభించింది. మహిళా లెక్చరర్లకు ప్రాధాన్యం ఇచ్చి మొదటి బ్యాచ్ శిక్షణను పూర్తి చేసింది. ఐఎస్‌బీతో కలిసి టాస్క్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంను రూపొందించిన టాస్క్ ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీ లెక్చరర్లకు శిక్షణ ఇచ్చింది. 14 అంశాలను నిర్దేశించుకొని కమ్యూనికేషన్, నూతన నైపుణ్యాలు, తరగతి గదిలో వ్యవహారశైలి వంటి అంశాల్లో రెండురోజుల శిక్షణను పూర్తిచేసింది. ఐఎస్‌బీ నిపుణుల ద్వారా ఇప్పించిన ఈ శిక్షణ అనంతరం ఫీడ్‌బ్యాక్ నివేదికను స్వీకరించి తదుపరి శిక్షణను మరింత మెరుగ్గా ఉండేలా నిర్ణయించింది. వీటిని మదింపు చేసుకొని తదుపరి శిక్షణను ఇవ్వనున్నట్టు టాస్క్ సీఈవో సుజీవ్ నాయర్ తెలిపారు.

427
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles