తాండూరు యువకుడికి బ్రెయిన్ డెడ్


Thu,July 12, 2018 01:47 AM

tandurs young man is Brain Dead

-ఫోన్ మాట్లాడుతూ రాంగ్‌రూట్‌లో హెల్మెట్ లేకుండా ప్రయాణం
-మరో బైక్‌ను ఢీకొనడంతో తలకు బలమైన గాయాలు

చార్మినార్: సెల్‌ఫోన్ మాట్లాడుతూ బైక్‌పై రాంగ్‌రూట్‌లో వెళ్తున్న ఓ యువకుడు ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొనడంతో అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ బహదుర్‌పుర పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగిం ది. ఎస్సై శివరామకృష్ట తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన మహ్మద్ ఖాజామోహినుద్దీన్(32) బహదుర్‌పుర సమీపంలోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. కంపెనీ పను ల్లో భాగంగా బయటకు వెళ్లి సెల్‌ఫోన్ మాట్లాడు తూ బైక్‌పై రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన ఓ బైక్ ఖజామోహినుద్దీన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఖాజామోహినుద్దీన్ తలకు బలమైన గాయాలుకావడంతో ఎలాంటి చలనం లేకుండా రోడ్డుపై పడిపోయాడు. పోలీసులు బాధితుడిని కాచిగూడలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు.అక్కడి వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించడంతో అక్కడి నుంచి ఉస్మానియాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటన సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయినట్టు ఎస్సై శివరామకృష్ణ తెలిపారు. వాటి ఆధారంగా బాధితుడు సెల్‌ఫోన్ మాట్లాడుతూ రాంగ్‌రూట్‌లో ప్రయాణించినట్టు నిర్ధారించామన్నారు. ప్రమాదానికి కారణమైన మరో ద్విచక్రవాహనదారుడిని గుర్తిస్తున్నామన్నారు.

1243
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS