సమాచారవ్యాప్తిలో ఫొటో జర్నలిస్టులది కీలకపాత్ర


Mon,August 19, 2019 02:50 AM

Talasani Srinivas Yadav asks officials to help photo journalists

-అవార్డులివ్వడం వారికి దక్కిన గౌరవం: మంత్రి తలసాని
-ఏటా అవార్డులిచ్చి ప్రోత్సహించాలి: సీఎస్ ఎస్కే జోషి
-తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు: అల్లం నారాయణ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సంఘటనలకు చిత్రరూపమిచ్చి ప్రజలకు చేరవేయడంలో ఫొటో జర్నలిస్టులది కీలకపాత్ర అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కొనియాడారు. జర్నలిస్టు కుటుంబాలు సంతోషంగా ఉండాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ మీడి యా అకాడమీ ఏర్పాటుచేశారని చెప్పారు. వరల్డ్ ఫొటోగ్రఫీ డేను పురస్కరించుకొని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలశాఖ నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో విజేతలకు ఆదివారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫొటో జర్నలిస్టులకు పోటీలు నిర్వహించి అవార్డులు ఇవ్వడం వారికి దక్కిన గౌరవమన్నారు. సీఎస్ ఎస్కే జోషి మాట్లాడుతూ.. ఫొటోగ్రఫీ అనేది ఒక కళ అని, ఫొటోగ్రాఫర్లందరూ ఆర్టిస్టులని కొనియాడారు. ఇలాంటి అవార్డుల కార్యక్రమాలను ప్రతియేటా నిర్వహించి ప్రోత్సహించాలన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఫొటో జర్నలిస్టులు కీలకపాత్ర పోషించారని తెలిపారు. సీఎం కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో నిమ్స్ దవాఖానలోని ఫొటో, శ్రీకాంతాచారి ఆత్మాహుతి ఫొటో ఉద్యమాన్ని ఉధృతం చేశాయన్నారు.

సమాచారశాఖ కమిషనర్ అర్వింద్‌కుమార్ మాట్లాడుతూ.. ఫొటో జర్నలిస్టులను ప్రోత్సహించేలా ప్రభుత్వపరంగా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సమాచారశాఖ అదనపు సంచాలకుడు నాగయ్య కాంబ్లే, మీడియా అకాడమీ కార్యదర్శి విజయ్‌గోపాల్, సంయుక్త సంచాలకుడు డీఎస్ జగన్ తదితరులు పాల్గొన్నారు. బంగారు తెలంగాణ, తెలంగాణ ఫెస్టివల్స్, ఫొటో జర్నలిజం, సిటీ డెవలప్‌మెంట్ విభాగాల్లో 52 మందిని విజేతలుగా ప్రకటించారు. ప్రతి క్యాటగిరీలో మొదటి బహుమతిగా రూ.25 వేలు, రెండో బహుమతిగా రూ.20 వేలు, మూడో బహుమతికి రూ.15 వేలు, ప్రోత్సాహక బహుమతికి రూ.10 వేలు, రూ.5 వేల చొప్పున అందజేశారు. నమస్తే తెలంగాణ ఫొటో జర్నలిస్టులు వీ రజినీకాంత్‌గౌడ్‌కు క్యాటగిరీ-1లో రెండవ, క్యాటగిరీ-4లో ప్రోత్సాహక బహుమతులు రాగా, క్యాటగిరీ-1లో సాయిలు (సంగారెడ్డి) ప్రోత్సాహక బహుమతిని, క్యాటగిరీ-3లో పీ సైదిరెడ్డి (హైదరాబాద్) ప్రోత్సాహక బహుమతిని గెలుచుకొన్నారు.
NT-AWARD-K-SAILU

విభాగాలవారీగా విజేతలు

బంగారు తెలంగాణ విభాగం:

మొదటి బహుమతి- ముచ్చర్ల విజయ్‌కుమార్ (నల్లగొండ), రెండో బహుమతి- వీ రజినీకాంత్ (హైదరాబాద్), మూడో బహుమతి- చావ సంపత్‌కుమార్ (ఖమ్మం),ప్రోత్సాహక బహుమతులు- కే శివకుమార్ (యాదాద్రి భువనగిరి), వీ శరత్‌బాబు (వరంగల్), కే సాయిలు (సంగారెడ్డి), జీ దేవీశ్రీ (ఖమ్మం), ఎన్ శివకుమార్ (హైదరాబాద్), సంపత్‌కుమార్ (మంచిర్యాల), సీహెచ్ నరేందర్ (నల్లగొండ), పఠాన్ హుస్సేన్‌ఖాన్ (ఖమ్మం), కే రమేశ్ (వరంగల్), కే.యాదగిరి (వరంగల్).

తెలంగాణ ఫెస్టివల్స్ విభాగం:

మొదటి బహుమతి- పీ సంపత్‌కుమార్ (మంచిర్యాల), రెండో బహుమతి- వీ శరత్‌బాబు (వరంగల్), మూడో బహుమతి- పఠాన్ హుస్సేన్‌ఖాన్ (ఖమ్మం), ప్రోత్సాహక బహుమతులు- కే బజ్‌రంగ్‌ప్రసాద్ (నల్లగొండ), చావ సంపత్‌కుమార్ (ఖమ్మం), ఎస్‌వీ రమేశ్ (వనపర్తి), మహిమల క్యాదర్‌రెడ్డి (కరీంనగర్), కే సతీశ్ (సిద్దిపేట), జీ వేణుగోపాల్ (జనగామ), కంది శివప్రసాద్ (ఆదిలాబాద్), ఎం నాగేశ్వర్‌రావు (ఖమ్మం), ఉప్పు సైదయ్య (పెద్దపల్లి).

ఫొటో జర్నలిజం విభాగం:

మొదటి బహుమతి- రవీందర్ (సూర్యాపేట), రెండో బహుమతి- ఆవుల శ్రీనివాస్ (హైదరాబాద్), మూడో బహుమతి- ఎన్.రాజేశ్‌రెడ్డి (హైదరాబాద్), ప్రోత్సాహక బహుమతులు- పీ సైదిరెడ్డి (హైదరాబాద్), జీ వేణుగోపాల్ (జనగామ), ఎన్.శివకుమార్ (హైదరాబాద్), ఎం.వినయ్‌కుమార్ (హైదరాబాద్), రాజమౌళి (హైదరాబాద్), దుబ్బాక సురేశ్‌రెడ్డి (హైదరాబాద్), కే శ్రీనివాస్‌ప్రసాద్ (నల్లగొండ), దశరథ్ రజువా (భద్రాద్రి కొత్తగూడెం), ఎం సత్యనారాయణ (సంగారెడ్డి), సుధాకర్ (నాగర్‌కర్నూల్).

సిటీ డెవలప్‌మెంట్ విభాగం:

మొదటి బహుమతి- లవకుమార్ (హైదరాబాద్), రెండో బహుమతి- కే శ్రీనివాస్ (హైదరాబాద్), మూడో బహుమతి- ఆర్ రాఘవేందర్ (హైదరాబాద్), ప్రోత్సాహక బహుమతులు- ఎం భాస్కర్‌రెడ్డి (సిద్దిపేట), ఎన్ రాజేశ్‌రెడ్డి (హైదరాబాద్), సూర్యా శ్రీధర్ (హైదరాబాద్), ఎం రమేశ్ (హైదరాబాద్), ఏ సతీశ్‌లాల్ (హైదరాబాద్), ఎం వెంకటేశంగౌడ్ (హైదరాబాద్), ఎం గోపీకృష్ణ (హైదరాబాద్), వీ రజినీకాంత్‌గౌడ్ (హైదరాబాద్), ఆవుల శ్రీనివాస్ (హైదరాబాద్), పీ కుమారస్వామి (కరీంనగర్).

742
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles