పంచాయతీ కార్యదర్శి అభ్యర్థులకు టీ సాట్ పాఠాలు


Thu,September 13, 2018 12:50 AM

T sat lessons for panchayat secretary candidates

-రేపటినుంచి పంచాయతీరాజ్ ఉద్యోగ గైడ్ ప్రసారం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరీక్షలకు అభ్యర్థులను సిద్ధం చేసేందుకు టీ సాట్ నెట్‌వర్క్ ఛానళ్ల ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నట్టు సీఈవో ఆర్ శైలేశ్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీరాజ్ ఉద్యోగ గైడ్ పేరుతో ఈ నెల 14 నుంచి బోధనాంశాలు ప్రసారం అవుతాయని పేర్కొన్నారు. అక్టోబర్ 4న నిర్వహించే పరీక్షకు సమయం తక్కువగా ఉన్నందున అదనపు గంటలు ప్రసారం చేయనున్నట్టు సీఈవో పేర్కొన్నారు. నిపుణ, విద్యలో కూడా ఈ ప్రసారాలు ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రసారమవుతాయని వివరించారు. పోలీసు ఉద్యోగ అభ్యర్థులకోసం రెండునెలలుగా అందించిన పాఠ్యాంశాలు టీ సాట్ యూట్యూబ్ www.youtube.com/softnettast లో అందుబాటులో ఉంటాయని, అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సీఈవో శైలేశ్‌రెడ్డి సూచించారు.

1798
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS