డిజిటల్ విద్యలో టీ సాట్‌కు అవార్డు

Fri,November 8, 2019 02:03 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: డిజిటల్ విద్యలో విశిష్ట సేవలు అందించినందుకుగాను టీ సాట్ నెట్‌వర్క్ చానళ్లకు అవార్డు లభించింది. బుధవారం రాత్రి ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో టీ సాట్ సీఈవో ఆర్ శైలేశ్‌రెడ్డి.. ఐఐపీఎం డైరెక్టర్ ఎస్‌ఎన్ త్రిపాఠీ చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్ ఎడ్యుకేషన్ క్యాటగిరీలో ఈ అవార్డును అందుకున్నారు. టీ సాట్ నెట్‌వర్క్ చానళ్లు శాటిలైట్‌తోపాటు డిజిటల్ మీడియాలో భాగమైన ట్విట్టర్, ఫేస్‌బుక్, యాప్, యూట్యూబ్ ద్వారా ఆధునిక పద్ధతుల్లో పాఠ్యాంశాలను ప్రసారం చేస్తున్నాయి. టీ సాట్ నిపుణ, విద్య చానళ్లు డిజిటల్ పద్ధతుల్లో మారుమూల ప్రాంత విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు అందిస్తున్న విధానాన్ని గుర్తించి గవర్నెన్స్ నవ్ సంస్థ ఈ అవార్డు అందజేసింది. ఈ సంస్థ 2019 ఏడాది అవార్డు కోసం మూడునెలల కింద దేశంలోని 22 ప్రభుత్వరంగసంస్థలకు సంబంధించి నామినేషన్లను స్వీకరించి, డిజిటల్ విద్యా బోధనకు టీ సాట్‌ను ఎంపికచేసింది. అవార్డు అందుకున్న సందర్భంగా సీఈవో శైలేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వపక్షాన అందించాల్సిన సేవల పట్ల తనకు మరింత బాధ్యత పెరిగిందన్నారు.

80
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles