ఐటీశాఖ ముఖ్యకార్యదర్శికి స్వీడన్ అవార్డు

Thu,December 5, 2019 01:18 AM

-ఢిల్లీలో అందుకున్న జయేశ్‌రంజన్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ స్వీడన్ దేశం అందించే ప్రముఖ పురస్కారం రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్‌ను లభించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుకు 400 ఏండ్ల చరిత్ర ఉన్నది. స్వీడన్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషిచేసిన విదేశీయులకు దీనిని అందజేస్తారు. తెలంగాణలో స్వీడన్ దేశ పెట్టుబడులు పెట్టడంలో, ఇండియాలోనే మొదటి ఐకియా స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడంలో కృషిచేసినందుకుగాను జయేశ్‌రంజన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

78
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles