వడోదర రికార్డును ఊడ్చేసిన హైదరాబాద్


Tue,February 13, 2018 02:56 AM

Swachh Bharat Guinness Record By Students Others

-స్వచ్ఛ సర్వేక్షణ్‌లో వెలుగుల బాట
-ఒకేసారి రోడ్లుఊడ్చిన 15,320 మంది
-స్వచ్ఛసర్వేక్షణ్‌లో అగ్రభాగాన నిలుపాలి: మంత్రి కేటీఆర్

ktr
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లో ఈ నెల 15 నుంచి చేపట్టనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 కార్యక్రమం సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రచారోద్యమం సరికొత్త రికార్డు సృష్టించింది. విద్యార్థులు, ఉద్యోగులతోపాటు విభిన్నవర్గాలకు చెందిన 15,320 మంది ఒకేసారి మూడునిమిషాలపాటు చీపుర్లతో రోడ్లను ఊడ్చి.. కొత్త రికార్డు నెలకొల్పారు. గతంలో 5,058 మందితో గుజరాత్‌లోని వడోదరలో నెలకొల్పిన గిన్నీస్ రికార్డును అధిగమించారు.

students
దీనితోపాటు యూఎస్‌కు చెందిన హైరేంజ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ కూడా దీనిని ప్రపంచ రికార్డుగా ప్రకటించింది. రాంనగర్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో వీఎస్టీచౌరస్తా నుంచి బాగ్‌లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీ వరకు నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ సలహాదారు జీ వివేక్, మాజీ మంత్రి వినోద్ తదతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరాన్ని అగ్రభాగాన నిలుపాలని విజ్ఞప్తిచేశారు. తడి, పొడి చెత్తపై ఇండ్లలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉన్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు.
ktr1

3945
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles